10-07-2025 12:00:00 AM
దివ్యాంగ, ట్రాన్స్‌జెండర్ సాధికారత శాఖ డైరెక్టర్ శైలజ
హైదరాబాద్, జూలై 9 (విజయక్రాంతి): రాష్ట్రంలోని నిరుద్యోగులైన ట్రాన్స్‌జెండర్లు ప్రైవేట్ సంస్థల్లో ఉపాధి అవకాశాలు పొందేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని దివ్యాంగులు, వయో వృద్ధులు, ట్రాన్స్‌జెండర్ల సాధికారత శాఖ డైరెక్టర్ బీ శైలజ బుధవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. దరఖాస్తులను www.wdsc. telangana.gov.in ద్వారా సమర్పించాలని సూచించారు. ఇతర వివరాల కోసం 040-24559050 నెంబర్ సంప్రదించాలని కోరారు.