17 April, 2026 | 3:15 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

మంత్రి అడ్లూరిని సన్మానించిన ఉద్యోగ సంఘాలు

16-06-2025 12:24 AM

విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై వినతి 

 మంత్రి భట్టితో ఫోన్లో మాట్లాడిన అడ్లురి 

జగిత్యాల, జూన్ 15 (విజయక్రాంతి): రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్’ను విద్యుత్ ఉద్యోగుల సంఘ నేతలు ఆదివారం మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. దీర్ఘకాలికంగా పెండింగులో ఉన్న విద్యుత్ ఉద్యోగుల సమస్యలు త్వరగా పరిష్కరించాలని మంత్రి అడ్లూరికి సంఘం నేతలు వినతి చేశారు. ఈ మేరకు ఐఎన్టీయూసి జిల్లా అధ్యక్షులు శంకర్, విద్యుత్ ఉద్యోగుల సంఘం 327 జిల్లా కార్యదర్శి రాంజీ నాయక్ ఆధ్వర్యంలో మంత్రికి వినతి పత్రం అందజేశారు.

కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని మళ్లీ పునరుద్ధరించాలని కోరారు. ఆర్టిజనులకు గ్రేడ్ మార్పిడి, విద్యుత్ ఉద్యోగుల పదోన్నతిపై మంత్రితో చర్చించారు. కాగా సానుకూలంగా స్పందించిన మంత్రి లక్ష్మణ్ కుమార్ వెంటనే విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్కతో పోన్లో మాట్లాడారు.

త్వరలో అధికారులు, ఉద్యోగ సంఘ నేతల జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి సమస్యల పరిష్కరానికి అవసరమైన చర్యలు తీసుకుంటానని మంత్రి భట్టి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ డివిజన్ అధ్యక్షుడు శంకర్, కార్యదర్శి రాజమల్లు , ట్రెజరర్ ప్రకాష్ నాయక్, ధర్మపురి సబ్ డివిజన్ కార్యదర్శి కుమారస్వామి, దోనూరు ఏఎల్‌ఎం రాజేందర్ తదితరులుపాల్గొన్నారు.