calender_icon.png 22 July, 2025 | 1:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధి కూలీలకు పని కల్పించాలి

12-03-2025 01:20:19 AM

వ్యవసాయ కార్మిక సంఘం రాష్ర్ట కార్యదర్శి ఐలయ్య

మునుగోడు, మార్చి 11 : ఉపాధి కూలీలకు పని కల్పించాలని తెలంగాణ వ్యవసా య కార్మిక సంఘం రాష్ర్ట కార్యదర్శి నారీ ఐలయ్య డిమాండ్ చేశారు. మండలంలోని కల్వకుంట్లలో ఉపాధి పనులను మంగళవారం పరిశీలించి మాట్లాడారు. జిల్లాలోని చాలా గ్రామాల్లో పని కల్పించడం లేదని, క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పేదలు వలస బాటపడుతున్నారని ఆరోపించారు.

ఆయన వెంట రైతు సంఘం రాష్ర్ట నాయకులు బండా శ్రీశైలం, ఫీల్డ్ అసిస్టెంట్ పరమేశ్, వ్యవసాయ కార్మిక సంఘం గ్రామఅధ్యక్ష, కార్యదర్శులు సింగపంగా ఎల్లయ్య, కట్టా ఎల్లమ్మ, సంఘ నాయకులు పగిళ్ల మల్లేశ్, సుగుణమ్మ, చిన్న యాదమ్మ, కావ్య, కనకమ్మ, ముత్తమ్మ పాల్గొన్నారు.