7 March, 2026 | 8:46 AM

కౌన్సిలర్లంటే విలువ లేదా కమిషనర్ గారూ..

07-03-2026 12:00 AM
  1. ప్రజాపాలన  ప్రగతి ప్రణాళిక కార్యక్రమం
  2. సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం ఎందుకు..?
  3. కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటు
  4. బీజేపీ, బీఆర్‌ఎస్ కౌన్సిలర్ల మండిపాటు 
  5. కమిషనర్ తీరుపై ఆగ్రహం
  6. సమావేశాన్ని బాయ్‌కాట్ చేసి వెళ్లి నిరసన వ్యక్తం 
  7. ప్రభుత్వ కార్యక్రమంపై ఇంత నిర్లక్ష్యమా..?
  8. కమిషనర్‌పై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్

కామారెడ్డి, మార్చి 6 (విజయక్రాంతి): ప్రజాపాలన = ప్రగతి ప్రణాళిక కార్యక్రమం గురించి సకాలంలో సమాచారం ఇవ్వలేదని శుక్రవారం కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో బిజెపి, బిఆర్‌ఎస్, కౌన్సిలర్లతోపాటు మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి, మరికొందరు కాంగ్రెస్ కౌన్సిలర్లు మహేష్, రామ్ శెట్టి హర్షిత లు మున్సిపల్ కమిషనర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కనీసం కుర్చీలు కూడా ఏర్పాటు చేయకుండా చిన్న టెంట్ వేసి తమరిని చిన్నచూపు చూశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిలర్లు అంటే ఇంత చిన్న చూపా అంటూ కమిషనర్ తీరుపై కౌన్సిలర్ లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశాన్ని బైకాట్ చేసి నిరసన వ్యక్తం చేశారు. దీంతో కమిషనర్ రాజేందర్ రెడ్డి క్షమించాలని కోరారు. కొత్త కౌన్సిలర్లుగా ఎన్నికైన తర్వాత ఇంతవరకు సమావేశం ఎందుకు ఏర్పాటు చేయలేదని అన్నారు. సమావేశంలో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయకపోగా కమిషనర్ ఒంటెద్దు పోకడ పోతున్నారని బీజేపీ కౌన్సిలర్ లు విమర్శించారు.

మున్సిపల్ కార్యాలయంలో బీజేపీ కౌన్సిలర్ లు మోటూరి శ్రీకాంత్ గుప్తా, ఆకుల సుజిత మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్ ఒంటెద్దు పోకడ లకు వెళ్లడం విచారకరం అని అన్నారు, కొత్త పాలకవర్గం ఎన్నికై 20 రోజులు కావస్తున్న ఇప్పటికీ మున్సిపల్ పాలక వర్గ సమావేశం  నిర్వహించక పోవడం ఏమిటని కమిషనర్ రాజేందర్ రెడ్డిని ప్రశ్నించారు.కనీసం అధికారులతో పరిచయ కార్యక్రమం పెట్టలేదు అని, వార్డు కౌన్సిలర్‌లు సమస్యల విషయమై ఎవరికి చెప్పాలని, ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక  కార్యక్రమం కూడా థూ థూ మంత్రంగా కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు.

అని అన్నారు. ప్రజా సమస్యలపై  ప్రశ్నించేందుకు బీజేపీ ఎప్పుడు ముందుంటుందని, సమస్యల పరిష్కారం కోసం బీజేపీ పోరాటం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని బీజేపీ కౌన్సిలర్ లు, టిఆర్‌ఎస్ కౌన్సిలర్లు, మున్సిపల్ వైస్ చైర్మన్ కాసర్ల గోదావరి స్వామి, లక్ష్మీనారాయణ, ను వాకౌట్ చేసి నిరసన తెలిపి సభ నుంచి వెళ్లిపోయారు.సమావేశం ప్రారంభంలోనే గందరగోళంగా టిఆర్‌ఎస్ బిజెపి కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు కొంతమంది కాంగ్రెస్ కౌన్సిలర్లు సైతం మున్సిపల్ కమిషనర్ సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు.

కాంగ్రెస్ కౌన్సిలర్లతో సమావేశం నిర్వహించ. సమావేశం ముగించారు. ఈ సమావేశం మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి అధ్యక్షతన కాంగ్రెస్ కౌన్సిలర్ ఆధ్వర్యంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని మమ అనిపించారు. మంత్రి నిజాంబాద్ జిల్లా కేంద్రానికి వస్తున్నారని తాను వెళ్లాలని కమిషనర్ రాజేందర్ రెడ్డి తప్పించుకున్నార పని కౌన్సిలర్లు  ఆరోపించారు.