calender_icon.png 12 September, 2025 | 3:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పట్నా దస్ కా దమ్

09-12-2024 12:00:00 AM

పుణే: ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్‌లో పట్నా పైరేట్స్ పదో విజయాన్ని నమోదు చేసుకుంది. ఆదివారం పుణే వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో పట్నా 38 తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్‌పై విజయాన్ని అందుకుంది. రెయిడర్ దేవాంక్ (14 పాయింట్లు) సూపర్ టెన్‌తో విజయంలో కీలకపాత్ర పోషించగా.. జైపూర్ తరఫున అర్జున్ 7 పాయింట్లు సాధించాడు. ఈ విజయంతో పట్నా పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది. మరో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 34 తో యు ముంబాపై గెలుపును అందుకుంది. గుజరాత్ తరఫున గుమన్, రాకేశ్ సూపర్ టెన్ సాధించగా.. ముంబా తరఫున అజిత్ 14 పాయింట్లతో మెరిశాడు.