calender_icon.png 7 November, 2025 | 11:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విలువిద్య పోటీల్లో జాతీయ స్థాయికి ఎదగాలి

07-11-2025 08:47:57 PM

ప్రతిభ కనబరిచి క్రీడాకారులు తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించాలి

కామారెడ్డి,(విజయక్రాంతి): వీలు విద్య  పోటీలలో విద్యార్థులు రాణించి జాతీయస్థాయి క్రీడాకారులుగా ఎదగాలని జిల్లా అర్చరి అసోసియేషన్ అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్ అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా దోమకొండ గడి కోటలో ఉమ్మడి జిల్లా విలువిద్య పోటీలను ఆయన ప్రారంభించారు. ఉమ్మడి జిల్లా స్థాయి విలువిద్య పోటీలను దోమకొండ గడికోట మైదానంలో అర్చరి అసోసియేషన్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల్ గౌడ్ ప్రారంభించినట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లా స్థాయిలోని వివిధ మండలాలకు చెందిన పలువురి అర్చరి క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి విలువిద్య పోటీల్లో ఇద్దరికి పతకాలు

దోమకొండకు గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థులు ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి విలువిద్య పోటీల్లో ఉత్తమ ప్రతిభ చూపారు. మహబూబాబాద్ లో నిర్వహించిన విలువిద్య రికర్వు రౌండ్ పోటీల్లో బి. ఇందు అండర్-17 విభాగంలో సిల్వర్ మెడల్, బి. వర్షిణి అండర్-14 విభాగంలో బ్రౌంజ్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా వారిని శాలువాతో ఘనంగా సన్మానించారు.

రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభచూపిన వీరిద్దరూ జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరిని శిక్షకునీ, అభినందించారు. అనంతరం రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనందుకు వారిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కోచ్ ప్రతాప్ దాస్, జిల్లా అర్చరి అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి, నాయకులు అండెం శంకర్ రెడ్డి, భూపాల్ రెడ్డి, రవి, రాములు ,కమ్మరి గంగాధర్ వివిధ అకాడమీకి చెందిన కోచర్లు పాల్గొన్నారు.