07-11-2025 08:44:09 PM
కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): శ్రీ కామాక్షి సమేత ఏకామ్రనాథుడి దయ ప్రజలపై సంపూర్ణంగా ఉండాలని బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ డివిజన్ మాణిక్య నగర్ లోని శ్రీ కామాక్షి సమేత ఏకామ్రనాథ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన నవగ్రహ పునః ప్రతిష్టాపన మహోత్సవంలో భాగంగా గత రెండు రోజులుగా ఋత్వికులచే మహా కుంభాభిషేకలు నిర్వహించగా శుక్రవారం నిర్వహించిన నవగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమంలో బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ఏకామ్రనాథ దేవాలయంలో స్వామి వారికి, నవగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.