13-02-2025 01:17:46 AM
అహ్మదాబాద్: సొంతగడ్డపై ఇంగ్లండ్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ముందు మంచి ఆత్మవిశ్వాసా న్ని కూడగట్టుకుంది. బుధవారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన మూడో వన్డేలో భారత్ 142 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 3 ఇంగ్లండ్‌ను వైట్‌వాష్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 356 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ శుబ్‌మన్ గిల్ (102 బంతుల్లో 112; 14 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో చెలరేగగా.. శ్రేయస్ అయ్యర్ (78), విరాట్ కోహ్లీ (52) అర్థశతకాలతో మెరిశారు.
ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ నాలుగు వికెట్లు తీయగా.. మార్క్ వుడ్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ భారత బౌలర్ల ధాటికి 34.2 ఓవర్లలో 214 పరుగులకే కుప్పకూలింది. టామ్ బ్రాంటన్ (38) టాప్ స్కోరర్‌గా నిలవగా.. అకిన్ సన్ (38) పర్వాలేదనిపించాడు.
అర్ష్‌దీప్, హర్షిత్ రానా, అక్షర్, పాండ్యాలు తలా 2 వికెట్లు తీశారు. సిరీస్‌లో సెంచరీ సహా రెండు అర్థసెంచరీలు చేసిన గిల్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’తో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ దక్కించుకున్నాడు. ఈ నెల 19 నుంచి ఆరంభం కానున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భారత్ తొలి మ్యాచ్‌ను బంగ్లాదేశ్‌తో ఆడనుంది.