04-01-2026 12:00:00 AM
డాక్టర్ తిరునహరి శేషు :
* జల వివాదాలపై ప్రభుత్వం, ప్రతిపక్షం ఆరోపణలు చేసుకుంటున్నాయే తప్ప పరిష్కారం కోసం ఆలోచించడం లేదు. ప్రజలకు సాంకేతిక అంశాలు తెలవకపోవచ్చుకానీ జరుగుతున్న పరిణామాలు భవిష్యత్తులో నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగే అవకాశం ఉందని అర్థమవుతుంది.
తెలంగాణ రాష్ర్టం ఏర్పాటైన ఒక దశాబ్దం తర్వాత అంతర్ రాష్ర్ట జలవివాదాలు, నీటి కేటాయింపులు, అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలు, రాష్ర్టంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల చుట్టూ వివాదాలు ముసురుకుంటూ ఒక రాజకీయ వివాదంగా మా రిన నేపథ్యంలో తెలంగాణ ప్రత్యేక రాష్ర్ట ఉద్యమ ఆకాంక్ష అయిన నిధులు-, నీళ్లు,- నియామకాలు అనే అంశం మరొకసారి తెరపైకి వస్తుంది. నీళ్లు లేక నెర్రెలు బారి నోళ్లు తెరిచిన నేలకి నీరు అందించాలనేది ఉద్యమ లక్ష్యం. సమైక్యాంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతానికి ప్రాజెక్టుల నిర్మాణంలో, నీటి వాటాల పంపకాలలో అన్యా యం జరిగింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత నాగార్జునసాగర్, శ్రీశైలం లాంటి కీలకమై న ప్రాజెక్టులు ఉమ్మడి ప్రాజెక్టులుగా మారటం కృష్ణా బేసిన్‌లో, గోదావరి బేసిన్‌లో తెలంగాణ రాష్ట్రానికి రావలసిన వాటా ల కేటాయింపులో న్యాయం జరగకపోవడం, పోలవరం లాగా జాతీయ ప్రాజెక్టు హోదాతో తెలంగాణ రాష్ర్టంలో నిర్మించుకునే సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం సహాయ సహకారాలు అందించకపోవడం జలవివాదాలకు దారితీస్తున్నా యి.
తెలంగాణ రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రాజెక్టుల విషయంలో, నీటి వాటాల పంపకాల విషయంలో రాజకీయ రంగు పులుముకుంటుంది. ఆంధ్రప్రదేశ్ అక్రమ నీటి ప్రాజెక్టుల నిర్మాణ ప్రతిపాదనలతో కాం గ్రెస్, బీఆర్‌ఎస్‌లు నీళ్ల విషయంలో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటుంటే వివాదాలకు పరిష్కారం చూపించాల్సిన కేంద్రం ఉదాసీనంగా ఉండటం జలవివాదాలకు దారి తీసినట్లయింది.
కేటాయింపుల్లో అన్యాయం
తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా, గోదావరి బేసిన్‌లే ప్రధాన నీటి వనరులు. కృష్ణానది నీటిని గ్రావిటీ ద్వారా, గోదావరి నీటిని ఎత్తిపోతల ద్వారా వినియోగించుకుంటు న్నాం. రెండు బేసిన్‌లలో ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే.. కృష్ణా బేసిన్‌లో ప్రాజెక్టులు ఉన్నా నీటి కేటాయింపులు తక్కువ, అదే గోదావరి బేసిన్‌లో నీటి కేటాయింపులు ఉన్నా కానీ ప్రాజెక్టులు తక్కువ. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారంగా కృష్ణాబేసిన్‌లో ఉన్న 2060 టీఎంసీలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 811టీఎంసీల నీటిని కేటాయించారు.
కానీ రాష్ర్ట విభజన సందర్భంగా తాత్కాలిక సర్దుబాటు క్రింద 66: 34 నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీలు, తెలంగాణ రాష్ట్రా నికి 299 టీఎంసీల నీటి ని కేటాయించారు. నీటి వాటాల పంపిణీలో తెలంగాణకు అన్యాయం జరిగిందని కె.ఆర్.ఎమ్ బి, బ్రిజష్ కుమార్ ట్రిబ్యునల్ వద్ద నదీ జలాలను పునః పంపిణీ చేయాలని తెలంగాణ వాదిస్తుంది. నదీ జలాల పునః పంపిణీలో జాప్యం జరగటానికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం సుప్రీంకోర్టు కూడా వెళ్లడం జరిగింది.
కృష్ణా పరివాహక ప్రాం తంలో నదీ జలాల పంపిణీకి కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభు త్వం డిమాండ్ చేసింది. కానీ కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయకుండా నది జలాల పునః పంపిణీకి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కాలపరిమితిని పెంచారు. కృష్ణ నీటి పరివాహక ప్రాంతం ఆధారంగా, కరువు పరిస్థితు ల దృష్ట్యా కృష్ణ బేసిన్‌లో 70 శాతం (763 టీఎంసీ) నీటి వాటా కేటాయించాలని తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం డిమాండ్ చేస్తుంటే పాత కేటాయింపులను కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ కోరుతుంది.
నాటి కేసీఆర్ ప్రభు త్వం కృష్ణా బేసిన్‌లో 299 టీఎంసీల నీటి కేటాయింపుకు ఒప్పుకోవ టం వలనే కృష్ణ బేసిన్‌లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శిస్తుంది. కృష్ణా బేసిన్‌లో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం వలన కేటాయించిన 299 టీఎం సీలలో సగటున తెలంగాణ 184 టీఎంసీలనే వాడుకోగలుగుతుంది. రెండు బేసిన్‌ల లో ప్రాజెక్టులు నిర్మాణం జరగకపోవడం, కడుతున్న ప్రాజెక్టులు పూర్తిగా కాకపోవ టం, కేటాయించిన నీటి వాటాను కూడా ఉపయోగించుకోలేకపోతున్నాం అనేది వాస్తవం.
కాళేశ్వరం నుంచి పోలవరం దాకా!
తెలంగాణ రాష్ర్టం ఏర్పాటైన తర్వాత గత ప్రభుత్వం నీటిపారుదల ప్రాజెక్టుల పైన 1.83 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని గణాంకాలు చెబుతున్నాయి. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుపైన 94 వేల కోట్ల రూ పాయలు పాలమూరు ప్రాజెక్టు పైన 27 వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినట్లుగా బీఆర్‌ఎస్ పార్టీ చెబుతున్నది. ఉత్త ర తెలంగాణ కోసం గోదావరి నదిపైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని దక్షిణ తెలంగా ణ కోసం కృష్ణా నదిపై పాలమూరు గారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నిర్మించ తలపెట్టడం బాగానే ఉన్నది.
కానీ లక్షల కోట్ల రూ పాయలు ఖర్చు చేసిన ఈ రెండు ఎత్తిపోత ల ప్రాజెక్టుల చుట్టూ వివాదాలు ముసురుకోవటం వల్ల రాష్ట్రానికి ఆర్థిక భారమే కాదు, రైతులకు ప్రయోజనం లేకుండా పోవడం బాధాకరం. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ కుంగిపోవటం అన్నారం, సుందిళ్ల బరాజ్‌లు కూడా ఉపయోగంలో లేకుండా పోవడంతో ప్రాజెక్టు ఉనికి ప్రమాదంలో పడటంతో గత రెండేళ్లుగా కాళేశ్వరం ప్రాజెక్టుపైన జరుగుతున్న రగడ అంతా ఇంతా కాదు. కాళేశ్వరం కథ ఇలా ఉంటే పాలమూరు ప్రాజెక్టుది మరొక వ్యథ.
మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు సాగునీరు, త్రాగునీరు, పారిశ్రామిక అవసరాలకి నీటి ని అందించటానికి రూపొందించిన పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుపై 34 వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టిన తరువాత 90 టీఎంసీల నీటి కేటాయింపు పై అభ్యంతరాలను తెలుపుతూ డీటైల్ ప్రాజెక్టు రిపో ర్ట్‌ని కేంద్ర ప్రభుత్వం తిప్పి పంపటం ఈఏసి సిఫారసు చేసిన తరువా త కూడా పర్యావరణ అనుమతులు నిరాకరించటం తో ప్రాజెక్టు భవితవ్యంపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి.
కేంద్ర ప్రభు త్వం అనుమతులు నిరాకరిస్తూ డీపీఆర్ తిప్పి పంపితే తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం కనీస స్థాయిలో కూడా స్పందించలేదని ప్రతిపక్ష బీఆర్‌ఎస్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. ఈ రెండు సంవత్సరాలలో పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులో ప్రభుత్వం తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలేదని ప్రతిపక్షం విమర్శిస్తుంటే గత ప్రభుత్వం నిర్వా కం వలనే ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం అవుతుందని ప్రభుత్వం ప్రతిపక్షం యొక్క విమ ర్శలను తిప్పి కొడుతుంది.
రాష్ర్ట ప్రయోజనాలే ముఖ్యం
కృష్ణా బేసిన్‌లో సరైన నీటి వాటా దక్కకపోవటం, కాళేశ్వరం ప్రాజెక్టులో తలెత్తిన లోపాలను సరిచేసి వినియోగంలోకి తీసుకురాక పోవడం, పాలమూరు రంగారెడ్డి పనులు నత్తనడకన కొనసాగటం, అనుమతులు రాకపోవడం, ఆంధ్రప్రదేశ్ బనకచ ర్ల, నల్లమల,్ల సాగర్, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ సామర్థ్యం పెంచుకొని జల దోపిడీ ప్రయత్నాలలో భాగంగా అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం రాష్ర్ట ప్రయోజనాల ను రైతాంగం ప్రయోజనాలను దెబ్బతీసేవే.
జల వివాదాలపై ప్రభుత్వం, ప్రతిపక్షం ఆరోపణలు చేసుకుంటున్నాయే తప్ప పరిష్కారం కోసం ఆలోచించడం లేదు. ప్రజ లకు సాంకేతిక అంశాలు తెలవకపోవచ్చు కానీ జరుగుతున్న పరిణామాలు భవిష్యత్తు లో నదీ జలాల విషయంలో తెలంగాణకి అన్యాయం జరిగే అవకాశం ఉందని అర్థమవుతుంది. పాలమూరు- డీపీ ఆర్ వెనుకకు వచ్చినా, కె.ఆర్.ఎమ్.బి కృష్ణా బేసిన్‌లో మన వాటా తేల్చకుండా తాత్సారం చేస్తున్నా రాష్ర్టం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు, ఎం పీలు పార్లమెంటు వేదికగా కొట్లాడకపోవ డం శోచనీయం.
నీళ్ల విషయంలో కాంగ్రె స్, బీఆర్‌ఎస్, బీజేపీలు రాష్ర్ట ప్రయోజనా లు కాపాడకపోతే తెలంగాణ ప్రత్యేక రా ష్ర్ట ఉద్యమ త్యాగాలకు అర్థమే లేదు. జల వివాదాలపై ఒకరిపై ఒకరు నిందలు వేసుకోకుం డా సమస్య పరిష్కారం కోసం రాష్ర్ట ప్ర యోజనాలు కాపాడటం కోసం అన్ని పార్టీ లు ప్రయత్నం చేయాలని ఆశిద్దాం.