calender_icon.png 12 January, 2026 | 3:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలుషిత భూతాన్ని తరిమికొడదాం!

04-01-2026 12:00:00 AM

ఐ.ప్రసాదరావు :

* ఏమాత్రం ఆలోచన ఉన్నవారైనా సరే, మంచినీళ్ల పైప్‌లైన్ మీద మరుగుదొడ్డి కడతారా? ఇంటింటికీ సరఫరా అయ్యే నీటిలో మురుగు నీరు వచ్చిన కలుస్తుంటే అధికారులు ఏం చేస్తున్నట్లు? అలా కట్టిన మరుగుదొడ్డి గుంత నుంచి పెల్లుబికిన వ్యర్థ జలాలు, ఆ టాయిలెట్ కింద నుంచి వెళ్తున్న ప్రధాన తాగునీటి పైప్‌లైన్‌లో కలవడంతో ఇండోర్‌లో విషాదాన్ని మిగిల్చింది.

జీవితాన్ని సంతోషంగా గడపాలంటే ముందు ఆరోగ్యం బాగుం డాలి. ఊరికే జబ్బు పడకూడదంటే జనావాసాల్లో పారిశుద్ధ్య సమస్యలు లేకుండా ఉండడంతో పాటు ప్రతిఒక్కరూ సురక్షితమైన తాగునీటికి నోచుకోవాలి. ఈ రెండు కరువైన చోట రోగాలు విజృంభించి అకా ల మరణాలకు మూలమవుతాయి. మన దేశంలో చాలా మందికి కనీసం మంచినీరు అందించలేని పరిస్థితుల్లో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఉండడం ఆలోచించాల్సిన విషయం.

ఒకపక్క భారత్ త్వరలో ప్రపంచంలోనే అతిపెద్ద మూడో ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుంది అని గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ సరైన తాగునీటి కోసం కొట్లాడుతున్న పరిస్థితి కానీ, తాగునీటికి సరైన వసతి లేని గ్రామాలు, పట్టణా లు ఇప్పటికీ దేశంలో చాలానే ఉన్నాయి. దేశంలో దాదాపు ప్రతీ ఏటా 37.7 మిలియన్ల మంది నీటి సంబంధించిన వ్యాధు లతో కాలగర్భంలో కలిసిపోతున్నట్లు తెలుస్తోంది. సగటున దేశంలో రోజూ 585 మంది కలుషిత నీరు తాగడం వలన, నీటి సంబంధించిన వ్యాధులతో మరణిస్తున్నారు అని పలు నివేదికలు పేర్కొంటు న్నాయి.

ఇటీవల కాలంలో మహారాష్ర్ట, కర్ణాటక, కేరళలో వరుసగా కలుషిత నీటి ఉదంతాలు చోటుచేసుకోగా తాజాగా స్వచ్ఛ నగరంగా పేరు పొందిన ఇండోర్‌లోని భగీరథ్‌పుర ప్రాంతంలో కలుషిత నీరు తాగడం వల్ల సుమారు 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. 

ప్రభుత్వాలదే బాధ్యత..

అయితే ప్రజల ప్రాణాలకు కలుషిత వ్యర్థాలతో ఎలాంటి ప్రమాదాలు తలెత్తకుండా చూసే బాధ్యత ప్రభుత్వాలేదనని గుర్తు చేస్తూ ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభ 2010లో స్వచ్ఛమైన తాగునీరు, పరిశుభ్రమైన పరిసరాలను మానవ హక్కుల్లో అంతర్భాగంగా గుర్తించింది. కానీ నిర్లక్ష్యంలో తేలియాడుతున్న అధికార యంత్రాంగం కారణంగా వ్యక్తిగత, గృహావసరాలకు తగినంత మంచినీటిని నిరం తరం పొందే హక్కు జన భారతానికి ఉన్నా లేనట్లుగానే అనిపిస్తున్నది. 

ఏమాత్రం ఆలోచన ఉన్నవారైనా సరే, మంచినీళ్ల పైప్‌లైన్ మీద మరుగుదొడ్డి కడతారా? ఇంటింటికీ సరఫరా అయ్యే నీటిలో మురు గు నీరు వచ్చిన కలుస్తుంటే అధికారులు ఏం చేస్తున్నట్లు? అలా కట్టిన మరుగుదొడ్డి గుంత నుంచి పెల్లుబికిన వ్యర్థ జలాలు, ఆ టాయిలెట్ కింద నుంచి వెళ్తున్న ప్రధాన తాగునీటి పైప్‌లైన్‌లో కలవడంతో ఇండోర్‌లోని భగీరథ్‌పుర్ ప్రాంతంలో విషాదాన్ని మిగిల్చేలా చేసింది. వరుసగా ఎనిమిదేళ్లపాటు దేశంలోనే శుభ్రమైన నగరంగా పురస్కారాలు పొందిన ఇండోర్‌లోనే పరిస్థితి ఇలా ఉంటే.. చెత్త, మురుగునీటికి ఆవాసాలుగా పేరు పడ్డ హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, తిరుపతి, తదితర నగరాల పరిస్థితి ఏమిటనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.

జబ్బుల బారిన భారతం..

ఏటా 3.77 కోట్ల మంది భారతీయులు కలుషిత నీళ్లలో నుంచి పురుడు పోసుకునే జబ్బుల బారినపడుతున్నారు. 15 లక్షల మంది పిల్లలు డయేరియాతో చనిపోతున్నారు. జల కాలుష్యంతో ప్రజల అనారో గ్యం దెబ్బతింటుండడంతో దేశం ఏడాదికి 7.3 కోట్ల పనిదినాలను నష్టపోతుంది. దానివల్ల భారత్‌కు సంవత్సరానికి 60 కోట్ల డాలర్ల ఆర్థిక నష్టం సంభవిస్తోంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 78 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ నేటికీ అందరికీ కనీసం విద్య, వైద్యం అందుబాటులో లేదు. అక్షరాస్యత అంతంత మాత్రంగానే ఉంది. ఇక మహిళల్లో బహు తక్కువ అక్షరాస్యత ఉన్న మాట వాస్తవం.

దేశంలో చాలా రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ ‘ లిక్కర్ కిక్’ పైనే ఆధారపడి ఉండడం చాలా దురదృష్టకరమైన విషయం. ఏ ప్రభుత్వాలైన ఆ రాష్ర్ట ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవాలి. కానీ మన ప్రభుత్వాలు ముఖ్యంగా పండగ వేళల్లో, ప్రత్యేక రోజుల్లో మద్యం ఎక్కువగా ఉత్పత్తి చేయడంతో పాటు ఆ మద్యాన్ని బాగా సేవించి, ప్రభుత్వాలకు ఆదాయం పెరగడానికి వీలుగా టైం పొడిగింపు ద్వారా ఎక్కువ మంది తాగుబోతులును తయారు చేసే ప్రయత్నం జరుగుతున్నది. తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. 

తగిన చర్యలు అవసరం..

ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరచడానికి ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాలి. దేశం అభివృద్ధి, ఔన్నత్యం ఆ దేశ ప్రజల నైపుణ్యాలపైన ఆధారపడి ఉంటుంది.. ఉత్పత్తి రంగంలో, సేవా రం గాల్లో ప్రజలు పాలుపంచుకోవడం ద్వారా దేశాభివృద్ధి ఆధారపడి ఉంటుంది... మన పాలకులు కలలు కంటున్న వికసిత్ భారత్ సాధ్యం కావాలంటే, ప్రభుత్వాలు ప్రజల కనీస అవసరాలు తీర్చుకోవడానికి అవసరమైన విద్యను అందించాలి.. వైద్య రంగా న్ని బలోపేతం చేయడానికి సన్నాహాలు చేయాలి. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. వలసలు తగ్గించాలి.. ఓటు బ్యాంకు రాజకీయాలు మానాలి. 

ఎప్పుడూ ప్రభుత్వాలు ఇచ్చే ఉచిత, సంక్షేమ పథకాలుపై ఆధారపడి బతికే జీవితాల నుంచి బయట పడేందుకు చర్యలు చేపట్టాలి. ఆ విధంగా ప్రభుత్వాలు ప్రజల జీవన స్థాయి మెరుగు పరిచే ఆశయాలను రూపొందించుకుని, ప్రతీ నూతన సంవత్సరం నూతన విధానాలు ద్వారా ప్రజల తలసరి ఆదాయం పెరగడానికి కొత్త కొత్త ప్రాజెక్టులు రూపొందించి వాటిని అమలు చేయాలి. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టే కలుషిత వ్యర్థాలకు చెక్ పెట్టే ప్రయత్నం జరగాలి.

అదే సమయంలో ప్రజలు కూడా ప్రభుత్వాలు ఎలా పనిచేస్తున్నా యో, ఏ లక్ష్యం కోసం తహతహలాడుతున్నారో అర్థం చేసుకోవాలి. ప్రఖ్యాత రష్యా నాయకుడు లెనిన్ చెప్పినట్లు ‘పాలకుల వ్యూహాలు గ్రహించలేనంత వరకు ప్రజలు మోసపోతూనే ఉంటారు’ అనే విషయం ఇకనైనా మన ప్రజలు అర్థం చేసుకోవాలి.

ప్రజలను రకరకాల కార్యక్రమాలు ద్వారా మభ్యపెడుతున్న ప్రభుత్వాలకు తగిన రీతి లో ఓటు ద్వారా గుణపాఠం చెప్పాలి. నేటి పాలకులకు, ప్రభుత్వాలకు తగిన రీతిలో ప్రజలు గుణపాఠం నేర్పడమే మన గురుతర బాధ్యత అని ప్రజలు, జెన్ జెడ్ యువ త గ్రహించాలి. సమ సమాజ అభివృద్ధి వైపు పయనించేలా ప్రభుత్వాల ఆశయా లు ఉండాలని కోరుకుందాం.