calender_icon.png 20 December, 2025 | 3:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేర్ హాస్పిటల్‌లో ఈఎన్టీ చికిత్సలు విజయవంతం

20-12-2025 02:00:38 AM

విదేశీ రోగులకు అధునాతన శస్త్ర చికిత్స

హైదరాబాద్, డిసెంబర్ 19(విజయక్రాంతి):‘ఆస్ట్రేలియా, అమెరికాల్లో విఫలమై న ఈఎన్టీ శస్త్రచికిత్సల అనంతరం, బంజారాహిల్స్‌లోని కేర్ హాస్పిటల్స్‌లో డాక్టర్ విష్ణు స్వరూప్‌రెడ్డి నేతృత్వంలో ఇద్దరు రోగులకు విజయవంతంగా చికిత్స నిర్వహించి ‘అధునాతన ఈఎన్టీ, ముఖ ప్లాస్టిక్ సర్జరీలతో అం తర్జాతీయ గమ్యస్థానంగా అవతరించింది.

ఆస్ట్రేలియా, అమెరికా నుంచి వచ్చిన ఇద్దరు రోగులకు సంబంధించిన అత్యంత క్లిష్టమైన ఈఎన్టీ సమస్యలకు బంజారా హిల్స్‌లోని కేర్ హాస్పిటల్స్ క్లినికల్ డైరెక్టర్, విభాగాధిపతి, చీఫ్ కన్సల్టెంట్ ఈఎన్టీ, ఫేషియల్ ప్లాస్టిక్ సర్జన్, కోక్లియర్ ఇంప్లాంట్ సర్జన్  డాక్టర్ ఎన్. విష్ణు స్వరూప్ రెడ్డి, ఎంఎస్ (ఈఎన్టీ), ఎఫ్‌ఆర్సిఎస్ (ఎడిన్బర్గ్), ఎఫ్‌ఆర్సిఎస్ (ఐర్లాండ్), డిఎల్‌ఓఆర్సీఎస్ (ఇంగ్లాండ్) నేతృత్వంలో నిపుణుల వైద్య బృందం విజయవంతంగా చికిత్స అందించింది.

మొదటి రోగి ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌కు చెందిన 35 ఏళ్ల సైబర్ సెక్యూరిటీ నిపుణుడు. స్వదేశంలో ఇప్పటికే రెండు సార్లు ముక్కు శస్త్రచికిత్సలు చేసినప్పటికీ అవి విఫలమవడంతో ఆయనకు తీవ్రమైన సాడిల్ నోస్ వైకల్యం ఏర్పడింది. దీంతో పాటు దీర్ఘకాలంగా శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొన్నాడు. ఈ పరిస్థితిలో చికిత్స కోసం ఆయన బంజారా హిల్స్‌లోని కేర్ హాస్పిటల్స్ సంప్రదించాడు.

వైద్యుల పరిశీలనలో ముక్కు లోపలి మద్దతు పూర్తిగా కో ల్పోయినట్టు తేలింది. దీంతో డాక్టర్ ఎన్. విష్ణు స్వరూప్ రెడ్డి, రోగి స్వంత కణజాలాన్ని ఉపయోగించి క్లిష్టమైన పక్కటెముక మృదులాస్థి పునర్నిర్మాణ శస్త్రచికిత్స నిర్వహించా రు. దీని ద్వారా ముక్కు ఆకారంతో పాటు దాని పనితీరును కూడా పూర్తిగా పునరుద్ధరించారు. అమెరికాలోని న్యూయార్క్‌కు చెం దిన 30 ఏళ్ల యువ ప్రొఫెషనల్‌కి రెండు చెవుల్లోనూ తీవ్రమైన వినికిడి లోపం ఉండే ది.

కాలిఫోర్నియాలో కుడి చెవికి చేయించిన శస్త్రచికిత్స విఫలమైన తర్వాత, ఆయన చికిత్స కోసం హైదరాబాద్‌లోని కేర్ హాస్పిటల్స్‌ను ఆశ్రయించాడు .పరీక్షల్లో ఆయనకు ‘ద్వైపాక్షిక ఓటోస్క్లెరోసిస్’ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. తొలుత, ఇంతకుముందు శస్త్రచికిత్స చేయని ఎడమ చెవికి స్థానిక మత్తులో స్టెపెడోటమీ శస్త్రచికిత్స నిర్వహించారు. శస్త్రచికిత్స పూర్తయ్యిన వెంటనే ఆపరేషన్ టేబ్పు నే ఆయనకు సాధారణ వినికిడి తిరిగి వచ్చింది.

ఈ ఫలితంతో ధైర్యం వచ్చిన డాక్టర్ విష్ణు స్వరూప్ రెడ్డి, అమెరికాలో గతంలో విఫలమైన కుడి చెవిపై సాంకేతికంగా అత్యంత సవాలుతో కూడిన రివిజన్ స్టెపెడోటమీ శస్త్రచికిత్సను విజయవంతంగా చేశారు.ఈ శస్త్రచి కిత్స ద్వారా కుడి చెవిలో కూడా వినికిడి పూర్తిగా పునరుద్ధరించారు. ఈ కేసుల ప్రా ముఖ్యతపై డాక్టర్ ఎన్. విష్ణు స్వరూప్ రెడ్డి మాట్లాడుతూ, నేను పదేళ్లకు పైగా ఇంగ్లాం డ్లో పనిచేశాను.

యూకే, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్ (పారిస్), ఆస్ట్రియా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో అత్యాధునిక శస్త్రచికిత్సలపై ప్రత్యేక శిక్షణ పొందాను. అయితే, భారతదేశంలో ఎదురయ్యే క్లిష్ట కేసుల సంఖ్య, వాటి లో కనిపించే వైవిధ్యం మాత్రం నిజంగా ఎక్కడా చూడని స్థాయిలో ఉంటుంది అని తెలిపారు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే అత్యంత క్లిష్టమైన కేసులనూ ఖచ్చితం గా, స్థిరంగా, నమ్మదగిన ఫలితాలతో విజయవంతంగా నిర్వహించే సామర్థ్యం మన వైద్యులకు ఉంటుంది.

కేర్ హాస్పిటల్స్ జోన ల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ బిజు నాయర్ మాట్లాడుతూ, ఏళ్ల తరబడి బాధతో పోరాడిన ఈ రోగులు మాపై ఉంచిన నమ్మకం, ఒక ప్రముఖ ఆసుపత్రిగా మేము మోస్తున్న బాధ్యతను మరింత పెంచుతోంది. డాక్టర్ విష్ణు స్వరూప్ రెడ్డి  అద్భుతమైన నాయకత్వంలో కేర్ బంజారా హిల్స్, క్లిష్టమైన ఈఎ న్టి శస్త్రచికిత్సలకు ముఖ్య కేంద్రంగా ఎదుగుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుం డా విదేశాల నుంచి కూడా రోగులు ఇక్కడికి వస్తున్నారు. ఇదే దిశలో మా సేవలను మరింత విస్తరిస్తూ ముందుకు సాగుతాము అని తెలిపారు.