calender_icon.png 19 September, 2025 | 8:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

మహిళా ఇంజనీరింగ్ కళాశాల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఎంపీ కడియం కావ్య

19-09-2025 07:08:01 PM

కాకతీయ యూనివర్సిటీ,(విజయక్రాంతి): మహిళా ఇంజనీరింగ్ కళాశాల బతుకమ్మ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎంపీ కడియం కావ్య శుక్రవారం మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న బతుకమ్మ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఎంపీ కడియం కావ్య పాల్గొన్నారు. కళాశాలకు మొదటిసారిగా వచ్చిన కడియం కావ్య గారికి ఘనంగా స్వాగతం పలికిన కళాశాల యాజమాన్యం ప్రిన్సిపాల్ స్టాప్, విద్యార్థులు మొదట కళాశాల ప్రిన్సిపల్ టీచింగ్ స్టాఫ్ తో ముచ్చడించి కళాశాలలో ఎటువంటి సమస్యలు ఉన్న తాను ముందుండి ఎటువంటి నిధులు తమకూర్చాలన్న నా వంతు సహకారం అన్నిట్లో ఉంటుందని ప్రిన్సిపల్ బిక్షాలు గారికి తెలియజేయడం జరిగింది.

మహిళలకు కావలసిన అన్ని ఏర్పాట్లు జాగ్రత్తగా చూసుకోవాలని హాస్టల్ కు సంబంధించిన వస్తువుల బిల్డింగ్ గురించి ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నా కూడా అన్ని తన వంతు సహకారం చేస్తా అని కడియం కావ్య అక్కడున్నా ప్రిన్సిపల్ గారికి మరియు అధ్యాపకులకు భరోసానిచ్చి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ ప్రజల గుర్తింపు బతుకమ్మని కడియం కావ్య గారు బతుకమ్మ సంబరాలలో పాల్గొని బోధన బోధ నేతరా ఉద్యోగాలు విద్యార్థులు విద్యార్థులు ఉద్దేశించి ప్రసంగిస్తూ పూల పండుగ ప్రకృతిని ఆరాధించే పండుగ గ్రామం పట్టణ ఆధునిక పేద తేడా లేకుండా చేసుకునే పండుగని మన సంస్కృతికి అద్దం పట్టే పండుగ ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్తంగా పాల్గొనే పండుగని కడియం కావ్యగారు ఉద్దేశించి బతుకమ్మ పాటలతో  నుత్యాలతో ప్రారంభించారు. బతుకమ్మ వేడుకలలో కాకతీయ యూనివర్సిటీ రిజిస్టర్ రామచంద్రం గారు మరియు SDLCE డైరెక్టర్ సురేష్ లాల్ గారు బతుకమ్మ నిర్వాహకులు మరియు కళాశాల ప్రిన్సిపాల్ బిక్షాలు గారు అందరూ వేడుకల్లో కడియం కావ్య గారితో  పాల్గొని విద్యార్థులలో ఉత్సవం నిలిపారు.