19-09-2025 07:01:29 PM
నిర్మల్,(విజయక్రాంతి): ఈనెల 22 నుండి 28 వరకు టాస్ పదవ, ఇంటర్మీడియట్ రాత పరీక్షలు నిర్మల్ లో నిర్వహించబడునని నిర్మల్ జిల్లా విద్యాశాఖ అధికారి డి భోజన్న తెలిపారు. తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో జరిగే ఈ పరీక్షలలో పదో తరగతి పరీక్షలకు ప్రభుత్వ ఉన్నత పాఠశాల జుమ్మెరత్ పేట్ నిర్మల్ పరీక్ష కేంద్రంగా కలదని, అదేవిధంగా ఇంటర్మీడియట్ పరీక్షలకు ప్రభుత్వ పాఠశాల ఇదిగాం నిర్మల్ పరీక్షా కేంద్రంగా కలదని వివరించారు.
ఈ పరీక్షలు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు మరియు పగలు 2: 30 నుండి సాయంత్రం 5:30 వరకు నిర్వహించబడతాయని వెల్లడించారు. ఈ పరీక్షలకు మొబైల్ ఫోన్ గాని ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువులు కానీ అనుమతించబడవని పేర్కొన్నారు. విద్యార్థులకు ఐదు నిమిషాలకు మించి ఆలస్యమైతే వారిని పరీక్ష కేంద్రంలోని అనుమతించబడరని తెలిపారు.
ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టికెట్లను తమ అధ్యయన కేంద్రాల ద్వారా గాని, తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం వెబ్సైట్ ద్వారా గాని డౌన్లోడ్ చేసుకొని హాజరుకావాలని పేర్కొన్నారు. పరీక్ష రాసే ప్రతి విద్యార్థి హాల్ టికెట్ తో పాటు తప్పనిసరిగా ఏదైనా ఒక ఒరిజినల్ ఐడెంటిటీ కార్డును తీసుకొని పరీక్షకు హాజరు కావాలని వెల్లడించారు. ఈ పరీక్షల నిర్వహణ గాను చీఫ్ సూపర్డెంట్ లను, డిపార్ట్మెంటల్ అధికారులను, ఇన్విజి లెటర్లను నియమించినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రంలో పోలీస్ సిబ్బంది తో పాటు మెడికల్ సిబ్బంది అంగన్వాడి సిబ్బంది ఉంటారని తెలిపారు.