calender_icon.png 19 September, 2025 | 8:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

యూ డైస్ అప్ డేషన్ పూర్తి చేయాలి: డీఐఈఓ

19-09-2025 06:57:11 PM

హనుమకొండ,(విజయక్రాంతి): వరంగల్  జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ రంగ, ప్రైవేట్  జూనియర్ కళాశాలల్లోని విద్యార్థులందరి యూడైస్, ఆధార్  తదితర అన్ని వివరాలు నవీకరించుకోవాలని  జిల్లా ఇంటర్మీడియేట్ విద్యాధికారి డా.శ్రీధర్ సుమన్ అన్నారు. శుక్రవారం  నాడు నర్సంపేట మైనారిటీ బాలికల కళాశాలలో అడ్మీషన్, అపార్ తదితర రికార్డులను పరిశీలించారు. ఇంటర్ బోర్డు ఆదేశానుసారం విద్యార్థుల యూ-డైస్ , ఇంటర్ బోర్డు వెబ్ సైట్ లోని అన్ని వివరాలను అన్ని కళాశాలల యాజమాన్యాలు అప్ డేట్ చేసుకోవాలని సూచించారు. ఇంటర్ విద్యార్థులు ఆధార్, అపార్, పెన్ నంబర్ తదితర వివరాలను నవీకరించాలని, యూ డైస్ పోర్టల్ లో విద్యార్థుల పెన్ లేదా అపార్  తదితర వివరాలను పూర్తి చేయడం తప్పని సరి అని,వరంగల్ జిల్లాలో  67 కళాశాలల్లో అడ్మీషన్ పొందిన విద్యార్థుల అన్ని వివరాలను నవీకరించడానికి సంబంధిత కళాశాలల యాజమాన్యాలు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.