24-10-2025 12:00:00 AM
ఏరియాలో సేవలను ప్రారంభించిన జీఎం రాంచందర్
మణుగూరు, అక్టోబర్ 23 (విజయక్రాంతి) : ఏళ్లుగా ఎదురు చూస్తున్న సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల కల నెరవేరింది. సింగరేణి సంస్థ లోని కాంట్రాక్ట్ కార్మికులకు ఈఎస్ ఐసీ సౌకర్యం కల్పించాలని యాజమాన్యం నిర్ణయించింది. సంస్థ లో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు ఈ ఎస్‌ఐ వైద్య సేవలను యాజమాన్యం అందుబాటులోకి తెచ్చేందుకు శ్రీకారం చుట్టింది. చాలా కాలంగా కంపెనీలో పలు విభాగా లలో కాంట్రాక్ట్ కార్మికులు పని చేస్తున్నారు.
ఇందులో బొగ్గు ఉత్పత్తితో సంబంధం లేకుండా పారిశుద్ధ్య, అటవీ, సివిల్, ఎస్ అండ్ పీసీ గారడ్స్, ఓబీ కాంట్రా క్టు కార్మికులు, కోల్ ట్రాన్స్ పోర్ట్ , కన్వెన్స్ డ్రైవర్లు, వైద్య కార్యాలయాల్లో పనిచేసే కార్మికులకు ఈఎస్‌ఐ సేవలు అందించేందుకు యాజమాన్యం చర్యలు చేపట్టింది. ఏరియాలో ఈఎస్‌ఐ వైద్య సేవలను ఏరియా జిఎం దుర్గం రామచందర్ గురువారం ఈఎ స్‌ఐ అధికారులతో కలిసి లాంచనంగా ప్రారంభించారు.
మణుగూరు ఏరియాలోని సుమారు 2,070 మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులు పనిచేస్తున్నారు. వీరందరి ఆరోగ్యాలకు భరోసాగా ఈఎస్‌ఐ వైద్య సేవలు అందనున్నాయి. నెలకు రూ.21,000 లోపు వేతనం ఉన్న కార్మికులు అర్హులు. ముఖ్యంగా కాంట్రాక్టర్ తరఫున చెల్లించాల్సిన 3.75 శాతం వాటాను కూడా సింగరేణి యాజమాన్యమే భరించనుంది.
యూనియన్లు నుంచి వచ్చిన విజ్ఞప్తు లను పరిగణన లోకి తీసుకుని, సింగరేణి సంస్థ పరిధిలోని కాంట్రాక్ట్ శ్రామికులకు ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) సౌకర్యాన్ని వర్తింప జేయాలని సంస్థ సంచలనాత్మక అడుగుతో ఏరియాలో ఉన్న శ్రామికులు, వారి కుటుంబ సభ్యులకు ఆరో గ్య భద్రత దొరకనుంది. ఈ భద్రతా పథకం కింద నెలకు రూ.21,000 లేదా అంతకంటే తక్కువ వేతనాలు సంపాదించే కాంట్రాక్ట్ కార్మికులకు మాత్రమే లబ్ధి పొందుతారు.
కాంట్రాక్ట్ ఉద్యోగులను ఈఎస్‌ఐసీ వ్బుసై ట్లో నమోదు చేసే ప్రక్రియ గురువారం ఏరియా లో ప్రారంభం అయింది. ఈ కార్యక్రమం రెండు రోజుల పాటు సింగరే ణి, ఈఎస్‌ఐ అధికారులు సంయుక్తంగా చేపడతారు. కాంట్రాక్టు ఐడీ, ఆధార్ నంబర్లు, సీఎస్టీ వివరాలు, వేతన స్టేట్మెంట్లు, రెండు పాస్పోర్ట్ సైజు ఫొటోలతో నిర్ణీత సమయంలో శ్రామి కులు హాజరుకావాలని ఏరియా సింగరేణి అధికారులు స్పష్టమైన సూచనలు ఇచ్చారు.
మరో వైపు సింగరేణిలో పనులు దక్కించుకున్న ఒక కాంట్రాక్టర్ వద్ద పదిమంది కంటే తక్కువ మంది పని చేస్తే ఈఎస్‌ఐ సేవలకు దూరమయ్యే అవకాశముందని కార్మిక సం ఘాల నేతలు చెబుతున్నారు. ఈ పథకం అ మలుకు కృషిచేసిన సింగరేణి సి ఎం డి ఎన్. బల రాం కృషి ప్రశంసనీయమని కాంట్రాక్ట్ కార్మికులు, హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై గళం విప్పిన ప్రతి సంఘానికి తమ హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సహకరించిన సింగరేణి సంస్థ మేనేజింగ్ అండ్ డైరెక్టర్ బలరాం, సంబంధిత అధికారులకు కాంట్రా క్ట్ కార్మికుల తరఫున ధన్యవాదాలు చెప్పారు.