calender_icon.png 17 November, 2025 | 8:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతనంగా చేరిన పోలీస్ సిబ్బంది అంకితభావంతో పనిచేయాలి

01-12-2024 04:17:52 PM

బెల్లంపల్లి ఎసిపి రవికుమార్..

మందమర్రి (విజయక్రాంతి): పోలీస్ శిక్షణను విజయవంతంగా పూర్తిచేసుకుని నూతనంగా ఉద్యోగంలో చేరిన కానిస్టేబుళ్ళు అంకితభావంతో విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందాలని బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ కోరారు. ఆదివారం పట్టణం పోలీస్ స్టేషన్ లోని సీఐ కార్యాలయంలో సర్కిల్ కు కేటాయించిన 23 మంది కానిస్టేబుళ్ల పరిచయ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై నూతన కానిస్టేబుళ్లను ఉద్దేశించి మాట్లాడారు. నూతన కానిస్టేబుళ్ళు విది నిర్వహణలో ఎటువంటి రాజీ పడకూడదని, శాంతిభద్రతలు పరిరక్షించడంలో తమదైన పాత్ర నిర్వహించాలని సూచించారు. ప్రజల రక్షణ మన కర్తవ్యంగా భావించి పని చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ శశిధర్ రెడ్డి, ఎస్సై రాజశేఖర్, కాసిపేట ఎస్ఐ ప్రవీణ్, రామకృష్ణాపూర్ ఎస్ఐ రాజశేఖర్, దేవపూర్ ఎస్ఐ ఆంజనేయులు పాల్గొన్నారు.