calender_icon.png 15 October, 2025 | 2:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీజీపీ బత్తుల శివధర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఈవి శ్రీనివాస్

14-10-2025 10:01:06 PM

హనుమకొండ (విజయక్రాంతి): ఇటీవల రాష్ట్ర నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ)గా బాధ్యతలు స్వీకరించిన బత్తుల శివధర్ రెడ్డిని హైదరాబాద్ లోని ఆయన కార్యాలయంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర పాలక మండలి సభ్యులు ఈ.వి. శ్రీనివాస్ రావు, బొద్దిరెడ్డి సతీష్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అక్టోబర్ 21 నుండి ప్రారంభమయ్యే పోలీస్ అమరవీరుల వారోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో రక్తదాన శిబిరాలు నిర్వహించాలని కోరారు. దీనికి డిజిపి బత్తుల శివధర్ రెడ్డి సానుకూలంగా స్పందించి, పోలీస్ శాఖ తరఫున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.