calender_icon.png 15 October, 2025 | 2:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి ఆసుపత్రిలో సౌకర్యాలు మెరుగుపరచాలి

14-10-2025 10:04:18 PM

ఏఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి రాంగోపాల్..

యూనియన్ ఆధ్వర్యంలో సింగరేణి ఆసుపత్రి ఎదుట నిరసన..

మణుగూరు (విజయక్రాంతి): సింగరేణి ఏరియా ఆసుపత్రి కొత్తగూడెంకి రిఫరల్ చేసే ఫస్ట్ ఎయిడ్ సెంటర్ గా మారిందని, ఏఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి వై. రాంగోపాల్ విమర్శించారు. ఆసుపత్రిలో సౌకర్యాలు మెరుగుపర్చాలని  యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం ఏరియా ఆసుపత్రి ఎదుట సమస్యలు పరిష్కరించాలని, నిరసన వ్యక్తం చేసి డివై సీఎంఓ జ్యోతిర్మయికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ కార్యదర్శి రాంగోపాల్ మాట్లాడారు. హాస్పిటల్ లో సరైన వైద్య సౌకర్యాలు లేక కార్మికులు, కార్మిక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. గైనాకలజిస్ట్, పిల్లల వైద్యులు లేక  గర్భిణీ స్రిలు, చిన్న పిల్లలు వైద్యం కోరకు అవస్థలుపడుతున్నారని ఆరోపించారు. గర్భిణీ స్త్రీలు వైద్యం కోసం కొత్తగూడెం ప్రయాణం చేయడం వల్ల వారి పరిస్థితి ప్రాణాపాయంగా మారిందన్నారు.

దూర ప్రయాణంతో గర్భిణీలు కొందరు గర్భాన్ని కోల్పోవడం అత్యంత దురదృష్టకర సంఘటన అని విమర్శించా రు. కనీసం ఏరియా అధికారులు విషయాన్ని పట్టించుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు. సింగరేణికి అధిక ఆదాయాన్నిచ్చే ఏరియాలోని కార్మికుల ఆరోగ్యాల పట్ల యాజమాన్యం చిన్నచూపు చూడడం తగదన్నారు. కార్మికుల ప్రాణాలతో  చెలగాటం ఆడితే బాధ్యత గల గుర్తింపు సంఘంగా చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. వెంటనే ఏరియా హాస్పిటల్ కి గైనకాలజిస్ట్, చిల్డ్రన్ స్పెషలిస్ట్ లను నియామించి, సరియైన వసతులు, మందులు అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో  వైస్ ప్రెసిడెంట్  రామ నరసయ్య, అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ మేకల ఈశ్వరరావు, సెంట్రల్ కౌన్సిల్ మెంబర్ దాట్ల సందీప్, పిట్ సెక్రటరీలు శనిగరపు కుమారస్వామి, సాయి ప్రకాష్ చారి, రవికుమార్, శ్రీనివాసరావు, రవి, శివకుమార్, రామారావు పాల్గొన్నారు.