23-01-2026 12:15:50 AM
కలెక్టర్ సిక్తా పట్నాయక్
నారాయణపేట.జనవరి 22(విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విజయక్రాంతి క్యాలెండర్ ను గురువారం నాడు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ డాక్టర్ వినీత్ గంగన్న లు ఆవిష్కరించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ నిజాలను నిర్భయంగా వెల్లడించినప్పుడే పత్రికలు, విలేకరుల పై గౌరవం ఏర్పడుతుందని అన్నారు.అదేవిధంగా ప్రభుత్వ చేపడుతున్న పలు పథకాలను ప్రజలకు తెలిసే విధంగా విలేకరులు చొరవ చూపించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో డీపీ ఆర్వో రషీద్ తో పాటు విజయ క్రాంతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గద్దెగూడెం యాదన్న, పాత్రికేయులు,ప్రహ్లాద్ రెడ్డి,సలీం, షకీలా అహ్మద్, తకి లు పాల్గొన్నారు.