calender_icon.png 26 August, 2025 | 11:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాకు 80 సీట్లు వచ్చినా ఈవీఎంలను నమ్మం

03-07-2024 04:09:26 AM

  • ఈవీఎంల విశ్వతనీయతపై అనేక అనుమానాలున్నాయి 
  • ప్రజలు ఇండియా కూటమికి నైతిక విజయం కట్టబెట్టారు 
  • లోక్‌సభలో ఎస్పీ అధినేత యాదవ్ కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, జూలై 2 : సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఆ పార్టీ ఎంపీ అఖిలేశ్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ లో క్‌సభ ఎన్నికల్లో తమ పార్టీకి 80కి 80 సీట్లు వచ్చినప్పటికీ ఈవీఎంలపై తనకు నమ్మకం కలగదని, వాటిపై నిన్న, నేడు, రేపు ఎప్పు డూ నమ్మకం లేదని స్పష్టం చేశారు. మంగళవారం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. చర్చలో భాగంగా నీట్ పేపర్ లీక్, ఈవీఎంలపై సం దేహాలు, అయోధ్య ఎన్నికల ఫలితాలు, ఉత్తరప్రదేశ్‌లో అవినీతిపై పలు ప్రశ్నలు సం ధించారు.

“ఎన్నికల సమయంలో 400 సీట్లు గెలుస్తామంటూ బీజేపీ విస్తృతంగా ప్రచారం చేసింది. కానీ ప్రజలు ఇండియా కూటమికి నైతిక విజయం కట్టబెట్టారు. ప్రస్తు త ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని అంతా చెబుతున్నారు. వ్యక్తిగత లక్ష్యాల ఆధారంగా దేశాన్ని నడిపించలేరు” అని బీజేపీ నేతృత్వంలోనే ఎన్డీయే ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. అనంతరం, ఈవీఎంల విశ్వసనీయతపై పలు సందేహాలు లేవనెత్తారు. “ఈవీఎంలపై నాకు ఎప్పుడూ నమ్మకం లేదు. మాకు యూపీలో 80కి 80 లోక్‌సభ సీట్లు వచ్చినా ఆ నమ్మకం కుదరదు. ఈవీఎంల సమస్య ఇంకా అలాగే ఉంది” అని ఆందోళన వ్యక్తం చేశారు.  

ఉద్యోగాలు ఇవ్వలేకే పేపర్ లీక్‌లు..

అసలు పేపర్ లీక్‌లు ఎందుకు జరుగుతున్నాయి? యువతకు ఉద్యోగాలు ఇవ్వొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వమే ఇలాంటి చర్యలకు దిగుతోంది” అని అఖిలేశ్ యాదవ్ మండిపడ్డారు. అయోధ్యలో బీజేపీ ఓటమి పరిణతి సాధించిన ఓటరు విజయమని, ఇది రాముడు ఇచ్చిన తీర్పుగా భావిస్తున్నామన్నారు. కులగణనకు మేం అనుకూలమని తేల్చి చెప్పారు. అలాగే అగ్నివీర్ స్కీమ్‌ను తాము ఎప్పటికీ అంగీకరించమని, ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దాన్ని రద్దు చేస్తామని స్పష్టం చేశారు.  ఉత్తరప్రదేశ్‌లో అవినీతి రాజ్యమేలుతున్నదని ఆరోపించారు.