07-07-2025 01:15:33 AM
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, జూలై 6 (విజయక్రాంతి): అప్పు తెచ్చి వ్యవసాయం చే ద్దామంటే ఆఖరికి ఎరువులకు కూడా కరువొచ్చిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చే శారు. ఆధార్ కార్డులు ఇచ్చి నా, రైతుకి కనీసం బస్తా ఎరువు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఎందుకుందని ఆదివారం ఎక్స్ వేదికగా ఆయన విమర్శలు గు ప్పించారు.
రాష్ర్టవ్యాప్తంగా 1.94 లక్ష ల మెట్రిక్ టన్నుల లోటు ఎందుకుం దో వివరించాలని డిమాండ్ చేశారు. రూ.266.50 ఉండాల్సిన బస్తా యూ రియా ధర ఇప్పుడు రూ. 325 ఎలా అయిందో ప్రజలకు తెలియాలని అ న్నారు. ఈ బ్లాక్ మార్కెట్ దందాను దగ్గరుండి నడిపిస్తున్నదెవరు అని ప్రశ్నించారు. కృత్రిమ కొరత ఎవరి వల్ల ఏర్పడుతుందో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.