calender_icon.png 7 July, 2025 | 7:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో 6 లక్షల 765 ఎకరాల్లో సాగుకు సిద్ధమైన రైతన్నలు

07-07-2025 01:16:00 AM

  1. అత్యధికంగా వరి

  2. తగ్గిన మిరప సాగు

సిద్ధం గా యూరియా

ఖమ్మం, జూలై 6 (విజయక్రాంతి): ధర ఉన్న లేకున్నా... లాభాలు వచ్చినా రాకున్నా..... భూమిని నమ్మిన రైతన్న సాగు చేయకుండా ఉండలేడు. పోయిన సీజన్లో మిర్చికి ధర లేక కొందరు రైతన్నలను నట్టేట ముంచి, వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టింది .. మళ్లీ కొండంత ఆశతో ఈ సీజన్ కు కూడా రైతన్నలు ఏర్పాట్లు చేసుకున్నారు.అప్పులు చేసైనా రైతన్న పొలం బాట పడతాడే తప్ప....

తను నమ్మిన భూమిని బీడు పెట్టుకోడు.ఖమ్మం జిల్లాలో ఈ వర్షాకాల సీజన్లో 6 లక్షల 765 ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేసేందుకు రైతన్నలు సిద్ధం చేసుకున్నారు. ఇందులో అత్యధికంగా వరి 2 లక్షల 94, ఎకరాల్లో సాగుకు సిద్ధం చేసుకున్నారు. ఒకవైపు మద్దతు ధర మరొకవైపు సన్న బియ్యం కు వున్న డిమాండ్ తో వరి సాగు పెంచారు. గడిచిన ఏడాది మిర్చికి సరేనా ధర లేకపోవడంతో ఈ సీజన్ లో మిర్చి పంట సాగు తగ్గించారు.

మిర్చి 40 నుండి 50 వేల ఎకరాల్లో సాగుకు సిద్ధం చేశారు. పత్తి 2 లక్షల 20 వేల ఎకరాల్లో సాగుకు ఏర్పాటు చేయగా మిగతాది పప్పు ధాన్యాల సాగుకు ఏర్పాట్లు చేసుకున్నారు.54,825 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం జిల్లాలో ఈ వర్షాకాల సీజన్ కు 54,825 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంది.

అధికారులు సమర్పించిన లెక్కల ప్రకారం ఏప్రిల్ నెలలకు 314 మెట్రిక్ టన్నులు, మే నెలకు 630 మెట్రిక్ టన్నులు, జూన్ కు 4,157 మెట్రిక్ టన్నులు, జులై కి 11,593 మెట్రిక్ టన్నులు, ఆగస్టుకు 17,747 మెట్రిక్ టన్నులు, మిగతాది సెప్టెంబర్ నెలకు కలిపి మొత్తం 54,825 మెట్రిక్ టన్నులు యూరియా అవసరం ఉందని ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపారు. జిల్లాకి సరిపడా యూరియా అందుబాటులో ఉందని అధికారులు చెబుతున్నారు.

రైతులు యూరియా కి ఎక్కడ ఎమ్మార్పి కన్నా ఎక్కువ చెల్లించకూడదని, అవసరానికి సరిపడా యూరియాని సొసైటీలలో సిద్ధంగా ఉంచామని అధికారులు చెబుతున్నారు.యూరియా సరిపడా వుంది-డి పుల్లయ్య, జిల్లా వ్యవసాయధికారి యూరియా సంబంధిత సొసైటీ ల్లో సిద్ధం గా వుందని, రైతులు ఎక్కడ ఎక్కువ ధరకు కొనాల్సిన పని లేదని, ఎవరైనా ఎమ్మార్పి కన్నా ఎక్కువకు విక్రహిస్తే తమ దృష్టికి తీసుక రావాలని అన్నారు.

నకిలీ విత్తనాల పాలిట జాగ్రత్త వహించాలని, ఎక్కడైనా విక్రహిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని తెలిపారు. ఎటువంటి సందేహాలు వున్న మీ ఏరియా లోని ఏ ఈ ఓని గాని ఏ ఓ ని గాని సంప్రదించాలని కోరారు. వారి సలహాలతో పొలాలకు కావలసినవి వాడితే మీ దిగుబడి కూడా పెరిగిద్దని తెలిపారు.