07-07-2025 01:13:36 AM
ఉద్దీపకం బుక్స్ సక్సెస్
రెండవ విడత బుక్స్ రిలీజ్
పిఓ రాహుల్ పై ప్రశంసల జల్లు
భద్రాచలం, జూలై 6 (విజయక్రాంతి): భద్రాచలం ఐటీడీఏ పిఓ రాహుల్ ది మాస్టర్ మైండ్ అనే చెప్పవచ్చు. గిరిజన ప్రా థమిక విద్యపై ఆయన స్ట్రాంగ్ ఫోకస్ పెట్టారు. ఈ దశలోనే సరైన పునాదులు పడాలని సమాలోచనలు జరిపారు. తత్ఫలితమే నూతన పుస్తకాల ఆవిష్కరణ. తొలి దశలో ప్రవేశపె ట్టిన ఉద్దీపకం పుస్తకాలు భారీ సక్సెస్ అవ్వటంతో రెండవ దశ పుస్తకాలు రెడీ చేసి రిలీజ్ చేశారు.
ఆదివారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మాత్యులు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, అంతకు ముందు రోజు గిరిజన సం క్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శరత్ తో కలిసి హైదరాబాదులో ఉద్దీపకం -2 బుక్స్ విడుదల చేశారు. ఇవి ఇక పిల్లలకు అందుబాటులోకి రానున్నాయి.
ఉద్దీపకం పుస్తకాలు సక్సెస్
భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయిలో గిరిజన బాలబాలికల ఉజ్వల భవిష్యత్తుకు భ ద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ ఐఏఎస్ ఇదివరకే ఉద్దీపకం-1 వర్క్ బుక్కులను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే.గిరిజన విద్యాసంస్థల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన నేపథ్యంలో పిల్లలు చదువులో వెనుకబడి పోకుండా ఉం డేందుకు పిఓ భారీగా కసరత్తులు చేశారు.
కాస్త కష్టతరంగా ఉండే ఇంగ్లీషు,గణితంపై గిరిజన పిల్లలు పట్టు సాధించేందుకు 3,4,5 తరగతుల పిల్లలకు నిష్ణాతులైన ఉపాధ్యాయులచే ఉద్దీపకం పేరున పుస్తకాలను తయారు చేయించారు.వీటిని అం దుబాటులోకి తీసుకురావడంతో గిరిజన పిల్లలు ఆయా సబ్జెక్టులో చక్కగా రాణిస్తున్నారు. పునాది స్థాయిలోనే గట్టి విద్యను గిరిజన పిల్లలకు అందజేస్తున్నారు. కూడికలు,తీసివేతలు, గుణకారాలు, భాగాహారాలు తదితర వాటిని సులువుగా నేర్పిస్తు న్నారు.
పిల్లలు కూడా ఆయా సబ్జెక్టుల్లో పట్టు సాధిస్తున్నారు. ఇంగ్లీష్ భాషపై కూడా నైపుణ్యాలను పెంపొందించుకుంటున్నారు.ఈ క్రమంలో ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో ఈ సం వత్సరం ఒకటవ తరగతి నుండి ఏడవ తరగతి వరకు చదువుతున్న గిరిజన విద్యార్థినీ విద్యార్థులకు,ఐటీడీఏ పీవో రాహుల్ ఉద్దీపకం -2 బుక్స్ కూడా రూపొందించి వాటిని పిల్లలకు అం దుబాటులోకి తీసుకొచ్చారు.
ఇది గిరి బిడ్డలకు ఎంతగానో ఉపకరించనున్నాయి.భద్రాచలం ఐటీడీఏ పరిధిలో గిరిజన విద్యా సంస్థల్లో ఇప్పటికే కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామును రూపొందించి అమలు చేసి రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల్లో అమలుకు ఆదర్శంగా నిలిచిన భద్రాచలం ఐటిడిఏ పిఓ రాహుల్ ఉద్దీప కం పుస్తకాల ప్రయోగంలో కూడా భారీ సక్సెస్ సాధించారని చెప్పవచ్చు. గిరిజన సంక్షేమ శాఖ అధికారులు పిఓ రాహుల్ నూతన పుస్తకాల రూపకల్పన పట్ల తీసుకున్న చర్యలను ప్రశంసిస్తున్నారు.