15 April, 2026 | 1:50 PM

Breaking News

ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలి.. సీపీఐ డిమాండ్   •   చీల‌ప‌ల్లిలో పొంగిపొర్లుతున్న నిర్లక్ష్యం   •   మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై దాడి   •   అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •  

ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ తప్పదు

28-06-2025 12:34 AM

మండల పిఆర్టియు నాయకులు

కామారెడ్డి,(విజయక్రాంతి): ప్రతి ప్రభుత్వ ఉపాధ్యాయునికి, ఉద్యోగికి పదవి విరమణ తప్పదని మండల పిఆర్టియు అధ్యక్షులు రమణ అన్నారు. శుక్రవారం  బత్తిని మాధవి మధుకర్ ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం ఎస్సి వాడ పాఠశాలలో పనిచేసి పదవి విరమణ చేస్తున్న సందర్భంగా శుక్రవారం కామారెడ్డి పట్టణంలోని వివేకానంద కాలనీ సీతారామాంజనేయ కళ్యాణ మండపంలో పదవీ విరమణ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. టిఆర్టి నాయకులు మండల పిఆర్టియు నాయకులు రూరల్ పిఆర్టియు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రధానోపాధ్యాయుడు మధుకర్ కు ఘన సన్మానం చేశారు. బత్తినీ మధుకర్  పదవి విరమణ మహోత్సవం అంగ రంగ వైభవంగా కొడుకుల కోడళ్ళు, మనుమలు మనుమరాళ్ళ, ఆత్మీయుల మద్య ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో   పి ఆర్ టి యు శాఖ అర్బన్,మండల శాఖ అధ్యక్షుడు dv రమణ, ప్రధాన కార్యదర్శి స్వామి, కామారెడ్డి Prtu రూరల్ శాఖ అద్యక్షుడు హన్మండ్లు, ప్రధాన కార్యదర్శి కృష్ణారావు, కామారెడ్డి  PRTU అర్బన్  మండల కార్యవర్గం ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల పిఆర్టియు శాఖ అధ్యక్షులు రమణ మాట్లాడుతూ... ప్రతి ఉద్యోగి ఉపాధ్యాయుడు పదవి విరమణ చేయక తప్పదని మధుకర్ తమ విధుల పట్ల పూర్తిస్థాయిలో విద్యార్థులకు న్యాయం చేసి జీవితం సార్థకత చేసుకున్నాడని ఆయన కొనియాడారు. అంతేకాకుండా పాఠశాలను సుందరంగా తీర్చిదిద్ది విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకునే విధంగా పాఠశాలను పూర్తిస్థాయిలో నవీనీకరణ చేసి ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఎస్సీ వాడ పాఠశాలలను తీర్చిదిద్దిన ఘనత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మధుకర్ కె దక్కుతుందని ఆయన అన్నారు.