15 April, 2026 | 12:07 PM

Breaking News

ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •   అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి   •  

సివిల్ కేసులో తలదూర్చిన పోలీసులు

28-06-2025 12:34 AM
  1. రైతును చితకబాదిన ఎస్సై

ఓవర్గానికి మద్దతుగా మరో వర్గానికి వేధింపులకు గురిచేశారని ఆరోపణలు

చండూరు, జూన్ 27 ( విజయ క్రాంతి):  న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వచ్చిన  తాస్కాని గూడెం గ్రామానికి చెందిన రైతుఆవుల వెంకన్నను చండూర్ ఎస్త్స్ర నర్సింగ్ వెంకన్న బండ బూతులు తిడుతూ చితకబాదాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,గత నెల 23వ తేదీన తన పొలం పక్క వారితో గెట్టుపంచాయతీ గురించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, ఎస్త్స్ర అవతలి వర్గం వారితోపాటు కొందరు పెద్దమనుషుల పిలిపించుకొని సమస్యను పరిష్కరించుకోమని సూచించాడని అని అన్నారు. కానీ అవతలి వర్గం వారు పెద్ద మనుషులు చెప్పిన పరిష్కారానికి ఒప్పుకోలేదు అన్నారు.

అన్నదమ్ముల మధ్య భూ సమస్యను సీరియస్ గా తీసుకొని,తిరిగి నన్ను గురువారం స్టేషన్ కు పిలిపించి సమస్య గురించి అడిగితే అవతలి వర్గం వినలేదని నేను చెప్తున్నా వాళ్ళు ఎందుకు వింటారు అంటూ నన్ను బండ బూతులు తిడుతూ తలపై బలంగా గుద్దుతూ దాడి చేశాడని రైతు ఆరోపించారు. వెంటనే ప్రభుత్వాసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నాన ని, సివిల్ మ్యాటర్లో జోక్యం చేసుకొని గురి చేసిన ఎస్‌ఐ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు రైతు తెలిపారు తెలిపారు.

సివిల్ మ్యాటర్ లో జోక్యం చేసుకోకూడదు అని పోలీసు ఉన్నత అధికారులు చెప్పిన అందుకు విరుద్ధంగా చండూర్ ఎస్త్స్ర రైతును చితకబాదడం చాలా విచారకరమని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇట్టి విషయంపై ఎస్త్స్ర పై తక్షణమే చర్యలు తీసుకోవాలని బాధితుడు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.