25-09-2025 12:13:16 AM
ఆదర్శ రైతు సన్మాన సభలో బాబూరావు
బోధన్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి) : ప్రతి రైతు ఉన్నత స్థానానికి ఎదగాలని, ఆధునీకరణ పధ్ధతిలో వ్యవసాయం చేపట్టి అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని ఐపీఐడీ ఎల్.సి.ఓ.ఐ.చైర్మన్ లయన్ ఘట్టమ నేని బాబురావు పేర్కొన్నారు. బుధవారం బోధన్ పట్టణ శివారు మంజీరా ఫంక్షన్ హాల్ లో లయన్స్ ఇంటర్నేషనల్ 320డి ఆధ్వర్యంలో వ్యవసాయం సంఘం అధ్య క్షులు పల్లెంపాటి శివన్నారాయణ అధ్యక్షతన ఆదర్శ రైతు సన్మాన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 110మంది ఆదర్శ రైతులకు మెమంటోలు, సర్టిఫికెట్లు అందజేసి శాలువాలతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్బంగా ముఖ్య అతిధిగా విచ్చేసిన లయన్ ఘట్టమనేని బాబారావు మాట్లాడారు. అధిక ఎరువుల వాడకంతో వ్యవసాయ పంటలు విషపూరితమవుతున్నాయని దీంతో అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుందన్నారు. ఎరువులను పరిమితంగా వాడాలని సూచించారు. వ్యవసాయ పంట పొలాలను రైతులు అభివృద్ధి చేసుకోవాలన్నారు. రైతులలో చైతన్యం రావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ముందుగా ఆయన చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ గవర్నర్ 320డి లయన్ అమర్ నాథ్ రావు, లయన్ దామోదర్ రాజు, జి.ఎం.టి. మల్టీపుల్ 320డి లయన్ పోలవరపు బస్వేశ్వర్ రావు, ప్రకాష్ రావు, విజయలక్ష్మి, సూర్యరాజ్, నరసింహ రాజు, రమేష్, వ్యవసాయ శాఖ సిబ్బంది, లయన్స్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు.