calender_icon.png 25 September, 2025 | 1:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వచ్చే సీజన్లో బ్యాంక్ లింకేజీ తప్పనిసరి.!

25-09-2025 12:13:29 AM

- లేదంటే అనర్హత లిస్టులోకి రైస్ మిల్స్ 

- సిఎంఆర్ 100% పూర్తి కావాల్సిందే

 - జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్

నాగర్‌కర్నూల్,(విజయక్రాంతి): రాబోయే ఖరీఫ్ సీజన్ 2025-26 లో బ్యాంకు లింకేజీ ఇవ్వని రైస్ మిల్లులకు ధాన్యం కేటాయింపు కష్టమేనని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ భద్రవత్ సంతోష్ రైస్ మిల్స్ యజమానులను హెచ్చరించారు. బుధవారం సీఎంఆర్ రికవరీ రాబోయే ఖరీఫ్ సీజన్ అంశాలపట్ల రైస్ మిల్లుర్లతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 2024-25 ఖరీఫ్, రభీ సీజన్ల సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) సరఫరా, రాబోయే ఖరీఫ్ 2025-26 సీజన్ ఏర్పాట్లపై చర్చించారు. మిల్లర్లు తమ మిల్లింగ్ సామర్థ్యానికి అనుగుణంగా తప్పనిసరిగా బ్యాంకు గ్యారంటీ సమర్పించాలని, ఇకపై సీఎంఆర్ రికవరీలో నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు. రబీ సీజన్ బియ్యం సరఫరా తక్కువగా ఉన్నందున ఇకపై వందశాతం డెలివరీ తప్పనిసరిగా అందించాలని ఆదేశించారు.