3 July, 2026 | 1:06 AM

ప్రతి ఓటరుకి ఎన్యూమరేషన్ ఫారాలివ్వాలి

03-07-2026 12:00 AM

కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

నాగర్ కర్నూల్, జూలై 2 (విజయక్రాంతి) : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)లో భాగంగా బీఎల్వోలు ప్రతి ఓటరుకి ఎన్యూమరేషన్ ఫారాలను నేరుగా అందజేసి, పూర్తిగా నింపించి తిరిగి సేకరించాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆదేశించారు. ఫారం సమర్పించని వారి పేర్లు కొత్త ఓటరు జాబితాలో నమోదు కాకపోయే అవకాశం ఉందని హెచ్చరించారు. నాగర్ కర్నూల్ పట్టణంలోని 107వ పోలింగ్ కేంద్రంలో ఫారాల పంపిణీని పరిశీలించిన ఆయన, జూలై 31 నాటికి ముసాయిదా ఓటరు జాబితా సిద్ధం చేస్తామని తెలిపారు.