8 March, 2026 | 12:24 PM

ప్రతీ మహిళ వైద్యపరీక్షలు చేయించుకోవాలి

18-09-2025 12:53 AM

ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల: సెప్టెంబర్ 17 (విజయక్రాంతి) మహిళలు ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపు నిచ్చారు. ఈ నెల 17 వ తేదీ నుంచి వచ్చే నెల 2 వ తేదీ వరకు నిర్వహించనున్న స్వస్థ్ నారి, సాశక్త్ పరివార్ అభియాన్. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోనీ అంబేద్కర్ నగర్ లోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడారు.

జిల్లాలోని అన్ని పీ హెచ్ సీలు, అర్బన్ హెల్త్ సెంటర్, ఏరియా హాస్పిటల్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, బస్తీ దవఖానాల్లో ప్రత్యేక వైద్య నిపుణులతో ఆరోగ్య పరీక్షలు చేస్తారని వివరించారు. మహిళల్లో ఎక్కువగా కనిపించే రక్తహీనత డయాబెటిస్, రక్తపోటు సమస్యలపై ప్రత్యేక పరీక్షలు సలహాలు అందించా లన్నారు.మహిళల ఆరోగ్యం పై అవగాహన కల్పించేందుకు ప్రతి రోజూ ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలని, విద్యాశాఖ అధికారి,

సంక్షేమ శాఖ అధికారి, ఇంటర్మీడియట్ అధికారుల సహకారంతో ఎస్సి, ఎస్టి, బీసీ, మైనారిటీ గురుకుల లోని బాలికలందరికీ స్పెషల్ క్యాంప్ ఏర్పాటు చేసి వైద్యుల ద్వారా అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాల ఆరోగ్య పరీక్షలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి అవసరమైన వారికి ఆరోగ్య శిబిరాలకు తరలించే ఏర్పాట్లు చేయాలన్నారు.

వైద్య ఆరోగ్య శాఖ అధికారి, సంక్షేమ శాఖ అధికారి సమన్వయంతో పని చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య మహిళా శక్తివంతమైన కుటుంబము అనే కార్యక్రమం కింద  ప్రత్యేక వైద్య నిపుణులచే కంటి పరీక్షలు, చెవి ముక్కు గొంతు, రక్తపోటు, డయాబెటిస్, దంత పరీక్షలు, నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ పరీక్షలు,

గర్భిణీ స్త్రీలకు పరీక్షలు, టీబీ పరీక్ష, సికిల్ సెల్ ఎనీమియా, మాతా శిశు సంరక్షణ, ఆరోగ్యకరమైన జీవనశైలి కొరకు వంట నూనెలను తగ్గించడం ద్వారా ఊబకాయాన్ని తగ్గించడం, రుతుక్రమ పరిశుభ్రత, పోషకాహారం గురించి మహిళలకు అవగాహన కల్పిస్తామని, ప్రజల భాగస్వామ్యంతో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం, నిశ్చయిమిత్ర వాలంటరీలు రిజిస్ట్రేషన్లు చేస్తారని వివరించారు.

టీబీ నియంత్రణకు నిక్షయ మిత్ర ఎన్ రోల్ మెంట్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. అనంతరం పది మందికి టీబీ బాధితులకు పోషకాహార కిట్లు, కోడిగుడ్లు పంపిణీ చేశారు.సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూపారెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. రజిత తదితరులు పాల్గొన్నారు.