04-08-2025 12:35:42 AM
భోజనం చేసిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి
మహబూబ్ నగర్ ఆగస్టు 3 (విజయ క్రాంతి) : రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అందరూ మనోళ్లేనని అభివృద్ధి ఎట్టి పరిస్థితుల్లో ఆగకుండా అడుగులు వేస్తుందని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నిర్వాసితులకు భరోసా కల్పించారు. ఆదివారం ఉదండాపూర్ రిజర్వాయర్ లో నిర్వాసితులతో కలిసి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది డిసెంబర్ 9వ తేదీ లోపు నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ డబ్బులను వారి ఖాతాలో జమ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
గతంలోనే నిర్వాసితులకు మాట ఇవ్వడం జరిగిందని, ప్రభుత్వంతో కొట్లాడి అయిన నిధులు తీసుకువచ్చి మీకు అందిస్తానని చెప్పిన మేరకు నిధులు తీసుకువచ్చి మీ అందరికీ అందించడం జరుగుతుందన్నారు. సీఎం రేవం త్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఇరిగేషన్ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అందరూ మనవాళ్లేనని, అందుకే అభివృద్ధి ఆగకుండా శరవేగంగా జరుగుతుందని స్పష్టం చేశారు.
నిధులను మం జూరు చేసిన ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి లతో కూలిన చిత్రపటానికి క్షీరభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఉదంతపూర్ నిర్వాసితులు భారీ ఎత్తున పాల్గొన్నారు.