12-07-2025 07:55:57 PM
కరీంనగర్ (విజయక్రాంతి): నగరంలోని కట్టరాంపూర్ లో గల కాకతీయ స్మార్ట్ కిడ్స్ పాఠశాల(Kakatiya Smart Kids School)లో శనివారం బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, మాజీ డిప్యూటీ మేయర్ చల్లా స్వరూప రాణి హరి శంకర్, మాజీ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్నలు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి అమ్మవారి విగ్రహానికి, చిత్రపటానికి పూలమాల వేసి ప్రారంభించారు.
బోనాల పండుగ విశిష్టత గురించి పాఠశాలలో నిర్వహించినటువంటి వ్యాసరచన పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందించారు. భగత్ నగర్ లోని పెద్దమ్మ తల్లి దేవాలయం వరకు విద్యార్థిని విద్యార్థుల నృత్య ప్రదర్శనతో ఒక ర్యాలీగా వెళ్లి బోనాలు, మొక్కులు చెల్లించుకున్నారు. చిన్నారులు వేసిన పోతరాజుల వేషాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ గున్నాల క్రాంతి కుమార్, పాఠశాల ప్రిన్సిపల్ గున్నాల అర్చన, ఇంచార్జి పెద్ది సందీప్, యూత్ కాంగ్రెస్ గుర్రం వాసు, పండ్రాల సుమంత్, ఎన్ ఎస్ యు ఐ సభ్యులు కొరివి అరుణ్ కుమార్, బాబు ప్రణవ్, అరవింద్, సతీష్, అధ్యాపక బృందం, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.