calender_icon.png 13 July, 2025 | 2:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పల్లాను పరామర్శించిన టీజేయూ జిల్లా అధ్యక్షులు భూస రమేష్ యాదవ్

12-07-2025 07:47:57 PM

జనగామ (విజయక్రాంతి): జనగామ శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి(MLA Palla Rajeshwar Reddy)ని మోహినాబాద్ ఫామ్ హౌస్ లో తెలంగాణ జర్నలిస్టు యూనియన్ జనగామ జిల్లా అధ్యక్షులు భూస రమేష్ యాదవ్ పరామర్శించడం జరిగింది. పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... త్వరలోనే కోలుకుంటానని ఆగస్టు 15న నియోజకవర్గంలో అడుగుపెడతానని జనగామ అభివృద్ధికి ఎప్పుడు తోడ్పడుతానని ఇప్పుడు నా ప్రజల బాగోగులే నాకు ముఖ్యమని అన్నారు.

జులై 7న తెలంగాణ జర్నలిస్టు యూనియన్ తరిగొప్పుల మండల కేంద్రంలో ఉచిత నోటు పుస్తకాల పంపిణీ విజయవంతంగా చేశారని నేను ఆరోగ్యంగా ఉంటే టీజేయూ మాకు ఆహ్వానం పంపించినందుకు అంత మంచి కార్యక్రమంలో పాల్గొని విద్యార్థుల మధ్యలో గడిపే వాడనని జర్నలిస్టు సంఘాలు జర్నలిస్టు సమస్యలే కాకుండా విద్యార్థులకు ఉపయోగపడే ఇంత మంచి కార్యక్రమాలు చేయడం అభినందనీయం అన్నారు. ఇంత మంచి కార్యక్రమం విజయవంతం చేసిన తెలంగాణ జర్నలిస్టు యూనియన్  సభ్యుల అందరికీ ధన్యవాదాలు తెలిపారు, మీ జర్నలిస్టుల శ్రేయస్సుకు  ఎప్పుడు నేను తోడ్పడుతూ నా సహాయ సహకారాలు అందిస్తా అన్నారు.