12-07-2025 07:44:04 PM
కరీంనగర్ (విజయక్రాంతి): విద్యార్థి జీవితంలో ఒక ఉపాధ్యాయుడైన, అధ్యాపకుడైన, ప్రొఫెసర్ అయిన, అకాడమిక్ గైడ్ గా, మెంటర్స్ గా మోటివేటర్స్ గా రోల్ మోడల్ గా ఉండాలని అలా ఉన్నప్పుడే విద్యార్ధులను సమాజ నిర్దేశకులుగా తయారవుతారని కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ(Satavahana University) ఎంబీఏ డిపార్ట్మెంట్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ డాక్టర్ ఈ మనోహర్ తెలిపారు. శనివారం నగరంలోని ఎస్ఆర్ఎం కళాశాల(SRM College)లో సమాజంలో గురువు పాత్ర.. విద్యార్థి జీవితంలో రోల్ ఆఫ్ టీచింగ్.. అనే అంశంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గురువు నిరంతర విద్యార్థిగా ఉన్నప్పుడే విద్యార్థికి సరియైన న్యాయం చేస్తారని అన్నారు.
విద్యార్థులో ఆగి ఉన్న క్రియేటివిటీ అంశాలను వెలికి తీయాలని అప్పుడే వారిలో ఉండే నైపుణ్యాలు బయటికి వస్తాయన్నారు. టీచర్ వృత్తిపరంగా ఉండాల్సిన వివరాలను, విద్యార్థులకు బోధించాల్సిన వివిధ అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయన చక్కగా వివరించారు. అనంతరం కళాశాల సిబ్బంది కి గ్రూప్ డిస్కస్ నిర్వహించి వారి ద్వారా ఆయన ఫీడ్ బ్యాక్ ను తెలుసుకున్నారు. అనంతరం కళాశాల యజమాన్యం తరఫున ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఏస్ ఆర్ ఎం విద్యాసంస్థల చైర్మన్ ఎం తిరుపతిరెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ వి పవన్ కుమార్, ఐక్యు ఏసి, నోడల్ ఆఫీసర్, ఖాజా, మొయినోద్దీన్, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.