calender_icon.png 9 July, 2025 | 4:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరిశుభ్రత అందరూ పాటించాలి

09-07-2025 12:00:00 AM

జిల్లా అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ 

మహబూబ్ నగర్ జూలై 8 (విజయ క్రాంతి) : పరిశుభ్రత కై ప్రతి ఒక్కరూ ఒక అ డుగు ముందుకేసి పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ అన్నారు. మంగళవారం జి ల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి తో కలిసి ప్రత్యేకంగా సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీలను పూర్తిస్థాయిలో పారిశుధ్యం ఉండేలా సిబ్బంది పర్యవేక్షణ చేయాలని సూచించారు. ప్రజలు సైతం పరిశుభ్రతకై అవసర మైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు కాలనీవాసులు ఉన్నారు.