calender_icon.png 9 July, 2025 | 10:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి

09-07-2025 12:00:00 AM

బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు 

హైదరాబాద్, జూలై 8 (విజయక్రాంతి): రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కా రు అన్ని రంగాల్లో తీవ్ర వైఫల్యం దిశగా పయనిస్తోందని.. ఇచ్చిన హామీలు, గ్యారెంటీలు అమలు చేయకుండా ప్రజలందరినీ మోసం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు విమర్శించారు. సర్కారు తీరును, వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు పార్టీ శ్రేణులంతా కృషి చేయాల ని సూచించారు.

బీజేపీ సిద్ధాంతాలను, కార్యక్రమాలను, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులదే కీలకపాత్ర పోషించాలన్నారు. మంగళ వారం పార్టీ రాష్ర్ట కార్యాలయంలో అధికార ప్రతినిధులతో ఆయన సమావేశమై కీలక సూచనలు చేశారు. పార్టీపై, పార్టీ నేతలపై, కేంద్రంపై విమర్శలు చేసే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఆరోపణలకు ధీటుగా కౌంటర్ ఇవ్వాల ని చెప్పారు.

ప్రధాని మోదీ ఆధ్వర్యంలో దేశంలో, రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలపై ప్రజల్లోనే అధికార పా ర్టీ నేతలను నిలదీయాలని సూచిం చారు. కాంగ్రెస్ ప్ర అధికారంలోకి వచ్చి 20 నెలలు కావస్తున్నా ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని మండిపడ్డారు. రాష్ర్టంలోని అన్ని వర్గాలకు న్యాయం బీజేపీతోనే సాధ్యమని చెప్పారు.

ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ చేప ట్టే కార్యక్రమాలతో పాటు రాష్ర్టంలో కాంగ్రె స్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై బీజేపీ పోరాటాలను సమర్థంగా ప్రజల దృష్టికి తీ సుకెళ్లాలని సూచించారు.

తాను కూడా గ తంలో పార్టీ రాష్ర్ట అధికార ప్రతినిధిగా బా ధ్యతలు నిర్వహించానని గుర్తు చేశారు. ఆ అనుభవం తనకు ఎంతో ఉపయోగపడిందన్నారు. సమావేశంలో పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి డా. కాసం వెంకటేశ్వర్లు, కార్యదర్శి డా. ఎస్. ప్రకాశ్‌రెడ్డి, అధికార ప్రతినిధులు ఎన్.వి.సుభాష్, తదితరులు పాల్గొన్నారు.