08-10-2025 12:53:05 AM
హైదరాబాద్, అక్టోబర్ 7 (విజయక్రాంతి) : రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమా ర్‌పై బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎమ్మార్పీఎస్‌తో పాటు వివిధ పార్టీలు, మాదిగ సామాజిక వర్గం నేతలు భగ్గుమంటున్నారు. మంత్రి పొన్నం చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు పెద్దగా స్పందించినట్లుగా కనిపించడం లేదని, కనీసం క్షమపణలు కూడా చెప్పించడంలో విఫలమైందని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు మిగతా రాష్ట్రాల్లోని మాదిగలు ఫైర్ అవుతున్నారు.
మంత్రి అడ్లూరిని ఉద్దేశించి పొన్నం ప్రభాకర్ చేసిన ‘దున్నపోతు’ వ్యాఖ్యలపై మాజీ మంత్రి మో త్కుపల్లి నర్సింహులు, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తీ వ్రంగానే స్పందించారు. బీసీ వర్గాలకు నా యకుడనని చెప్పుకునే పొన్నం ప్రభాకర్.. మాదిగ సామాజిక వర్గానికి చెందిన అడ్లూరిపై అనుచిత వ్యాఖ్యలు చేయడమేంటి..? మాదిగలు అంటే లెక్కలేని తనమా..? మాకు ఆత్మగౌరవం ఉండదా..? వెంటనే మంత్రి అ డ్లూరికి క్షమాపణ చెప్పాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన తప్పదని హెచ్చరించారు.
అవసరమైతే పొన్నం ప్రభాకర్ ఇంటి ని ముట్టడిస్తామని మాదిగ సామాజికవర్గానికి చెందిన యువకులు ఇప్పటికే హెచ్చరిం చారు. అంతే కాకుండా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ స్పందిచాలని డిమాండ్ చేశారు. తోటి మంత్రిని గౌరవించే సంప్రదాయం పొన్నం ప్రభాకర్‌కు లేకపోవడం బాధాకరమని, అక్కడే ఉన్న మరో మంత్రి వివేక్ వెంకటస్వామికి కూడా వంతపాడే విధంగా వ్యవహరిం చడంపైన సొంత పార్టీ కాంగ్రెస్‌తో పాటు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలోనూ కాంగ్రెస్‌లోని ఒక వర్గం నాయ కులు.. అధిష్ఠానం నిర్ణయాన్ని ధిక్కరించే విధంగా వ్యవహరించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఇప్పుడు ఏకంగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినా పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీలో మాదిగలంటే లెక్కలేని తనం కనిపిస్తోందని, ఆ పార్టీలో రెండో శ్రేణిగా మాదిగలను గుర్తిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఒక వైపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఐ క్యంగా ఉండాలని కోరుకుంటున్న తరుణం లో మాదిగ సామాజిక వర్గానికి చెందిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌పై బీసీ సా మాజిక వర్గానికి చెందిన పొన్నం ప్రభాకర్‌గౌడ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు.. ఐక్యత నినాదానికి విఘాతం కలుగుతుందని, మిగతా బీసీ సంఘాలు, వివిధ కుల సం ఘాల నాయకులు అభిప్రాయపడుతున్నా రు. కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి వెన్నుదన్నుగా ఉన్న మాదిగలు.. మంత్రి పొన్నం తీరుతో నష్టం జరిగే ప్రమాదం ఉందని రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
ఒక వైపు రాష్ట్రంలో స్థానిక, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందడి మొదలైందని, ఇలాంటి సమయంలో గ్రామాల్లో మెజార్టీగా ఉండే మాది గల ఓట్లు ప్రభావం చూపిస్తాయని కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి వ్యవహరిస్తున్న తీరు ఆక్షేపణీయంగానే ఉందని సొంత పార్టీ నేతలే తప్పు పడుతున్నారు. ఎమ్మార్పీఎస్ శ్రేణులు, మా దిగ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా పొన్నం, వివేక్ తీరును తప్పుపడుతూ మంగళవారం నిరసన వ్యక్తం చేశారు.