25-10-2025 06:56:52 PM
నారాయణపేట,(విజయక్రాంతి): నారాయణ పేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్ స్టాండ్ వద్ద ఈవీఎం గోడౌన్ లో ఈవీఎంలు కట్టు దిట్టమైన భద్రత మధ్య ఉన్నాయని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను తెలిపారు. శనివారం ఇక్కడి ఈవీఎం గోడౌన్ ను ఆయన పరిశీలించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా గోడౌన్ ను సందర్శించడం జరిగిందని ఆయన చెప్పారు. ఈవీఎం గోడౌన్ కు వేసిన సీళ్లను చెక్ చేశారు. ఈవీఎం గోడౌన్ వద్ద పోలీసు బందోబస్తు తీరును గమనించి పలు సూచనలు చేశారు. అదనపు కలెక్టర్ వెంట ఆర్.డి.ఓ. రామచందర్ నాయక్, కలెక్టరేట్ ఎన్నికల విభాగం అధికారినిలు అఖిల ప్రసన్న, రాణి దేవి,సిబ్బంది ఉన్నారు.