calender_icon.png 26 October, 2025 | 5:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామ సభను బహిష్కరించిన మనోహరాబాద్ ప్రజలు

25-10-2025 06:57:35 PM

మనోహరాబాద్ (విజయక్రాంతి): మెదక్ జిల్లా మనోహరాబాద్ గ్రామ పంచాయతీలో శనివారం గ్రామసభ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ గ్రామస్తులు ఈ గ్రామ సభను బహిష్కరించారు. మనోహరాబాద్ లో అనేక సమస్యలు నెలకొన్నాయని వాటిని ముందుగా పరిష్కరించాలని సెక్రటరీతో వాదించారు. ముఖ్యంగా అక్కడక్కడ వీధి దీపాలు లేకపోవడం, కాలనీలలో ఎక్కడ చెత్త అక్కడే ఉండిపోవడం, దోమల, ఈగల నివారణ మందులు పిచికారి చేయకపోవడం ఇలా అనేక సమస్యలు నెలకొన్నాయని గ్రామస్తులు పలుమార్లు గ్రామ సెక్రెటరీ దృష్టికి తీసుకెళ్లిన బేఖాతర్ చేస్తూ పనులు చేయకపోవడంతో గ్రామస్తులు గ్రామ సభను బహిష్కరించారు.

ముఖ్యంగా గ్రామ అధికారి విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించడం పనుల జాప్యం చేయడంతో గ్రామస్తులు అసహనం వ్యక్తం చేశారు. నూతన ఇండ్ల నిర్మాణంలో ఎన్ఓసి విషయంలో మొండి వైఖరి చూపిస్తుందని గ్రామస్తులు ఆరోపించారు. ఇందులో ఇందులో మాజీ ఎంపీటీసీ లతవెంకట్ గౌడ్, ఫ్యాక్స్ డైరెక్టర్లు జావేద్ పాషా, వెంకట్ రెడ్డి, కులసంఘాల పెద్దలు, మహిళలు, పాల్గొన్నారు.