calender_icon.png 11 August, 2025 | 11:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

28 కొత్త బార్లకు ఆబ్కారీశాఖ నోటిఫికేషన్

15-05-2025 12:00:00 AM

జూన్ 6 వరకు దరఖాస్తులకు గడవు 

హైదరాబాద్, మే 14 (విజయక్రాం తి): రాష్ట్రంలో 28 కొత్త బార్లకు ఆబ్కారీశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో జీహెచ్‌ఎంసీ (హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్) పరిధిలో 24 బార్లకు, మహబూబ్‌నగర్, నిజామాబాద్, బోధ న్, సరూర్‌నగర్‌లోని జల్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఒక్కో టూబీ బార్లకు.. జూన్ 6 వతేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది. ప్రతీ దరఖాస్తుకు రూ.లక్ష ఫీజును ఖరారు చేశారు.

దరఖాస్తు ఫారమ్‌తో పాటు రూ.లక్షను డీడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు కోసం డీడీ రూపంలో చెల్లించిన రూ.లక్షను తిరిగి చెల్లించమని అబ్కారీ శాఖ అధికారులు పేర్కొన్నారు. నోటిఫికేషన్ ఇచ్చిన 28 బార్లకు ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులైన చేసుకోవచ్చని సూచించింది. బార్ల కో సం వచ్చిన దరఖాస్తులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలోని బార్లకు ఏడాదికి రూ.40 లక్షలు, జల్‌పల్లి, మహబూబ్‌నగర్, నిజామాబాద్, బోధన్‌లోని బార్లకు ఏడాదికి రూ.42 లక్షల చొప్పున ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. కాగా, ఇటీవలనే 35 బార్లకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.