11-08-2025 11:24:10 PM
తూప్రాన్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం తూప్రాన్ మండల శాఖ అధ్యక్ష పదవికి జి. మల్లారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికి, పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ముఖ్యంగా పెన్షన్ల మంజూరి, పెంపు కోసం ప్రభుత్వ స్థాయిలో చర్యలు తీసుకుంటానని తెలిపారు. అలాగే సంఘం ఆధ్వర్యంలో రిటైర్డ్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల కోసం సేవా కార్యక్రమాలు, వైద్య శిబిరాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వ హించనున్నట్లు హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర రిటైర్డ్ ఉద్యోగుల సంఘం తూప్రాన్ మండల శాఖ ఎన్నికలు సోమవారం ఆ శాఖ భవనంలో ఎన్నికల అధికారి గాలి కుమార్, ఎన్నికల అబ్జర్ వర్ శ్యామ్ సుందర్, జిల్లా అధ్యక్షులు జగదీష్ చంద్ర, జిల్లా కార్యదర్శి సత్యనారాయణ ల పర్యవేక్షణలో ఏకగ్రీవంగా ఎన్నికలు నిర్వహించారు.
రిటైర్డ్ ఉద్యోగుల సంఘం తూప్రాన్ మండల అధ్యక్షులుగా జి. మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి గా ఎస్. విద్యాసాగర్, ఫైనాన్స్ సెక్రెటరీగా జి. నాగ భూషణం, అసోసియేట్ ప్రెసిడెంట్ గా శంకరంపేట రాములు గౌడ్, వైస్ ప్రెసిడెంట్ గా ఆర్. బిక్షపతి గౌడ్, ఉమెన్స్ వింగ్ వైస్ ప్రెసిడెంట్ గా మాజీ జెడ్పీటీసీ నాయిని అండాలమ్మ, సంయుక్త కార్యదర్శి గా ఎం.వి. మధుసూదన్ రావు, ఆర్గనైజింగ్ సెకరేటరిగా ఎన్. ఉమారాణి, ప్రచార కార్యదర్శిగా జి. మల్లయ్య లను లాంఛనంగా యూనియన్ నియమ నిబంధనలు ప్రకారం నామినేషన్ పత్రాలు సమర్పించగా ఒక్కో పదవికి ఒక్కో నామినేషన్ దాఖలు కాగా నూతన కార్యవర్గం ను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి గాలి కుమార్ ప్రకటించి వారిచే ప్రమాణ స్వీకారం చేయించి బాధ్యతలు అప్పగించారు. ఈ కార్యక్రమంలో జీ. మల్లారెడ్డి, ఎస్. విద్యాసాగర్, జీ. నాగభూషణం, ఎస్. రాములు, అర్.బిక్షపతి, నాయిని అండాలమ్మ, ఎం.వి. మధుసూదన్ రావు, ఎన్. ఉమారాణి, జీ. మల్లయ్య, జె. జగదయ్య, కాసుల కిష్టయ్య, పి. రామ కృష్ణయ్య, రఘుపతి రెడ్డి, ఎన్.ముత్యాలు, నరసింహారెడ్డి, ఎన్.గోపాల్ రెడ్డి, భీమరి నర్సింలు తదితరులు పాల్గొన్నారు.