calender_icon.png 12 August, 2025 | 2:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కస్తూర్బా బాలికల హాస్టల్ సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం

11-08-2025 10:56:27 PM

చండూరు (విజయక్రాంతి): చండూరు మున్సిపాలిటీలోని కస్తూరి బాలికల హాస్టల్ విద్యార్థులకు వండిన ఆహారం ఇంతమందికి ఎలా సరిపోతుందని సిబ్బందిపై మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి(MLA Rajagopal Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం చండూరు మున్సిపాలిటీలోని కస్తూరిబా బాలికల హాస్టల్ ను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులకు వండిన ఆహారాన్ని రుచి చూసి ఆహార నాణ్యతను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం మెస్ చార్జీలు పెంచిన కూడా విద్యార్థులకు వండిన ఆహారంలో నాణ్యత పెరగలేదని ఆయన అన్నారు. విద్యార్థుల సంఖ్యకు వండిన ఆహారానికి ఏ మాత్రం పొంతనలేదని ఆయన అన్నారు. అనంతరం విద్యార్థులు మౌలిక సదుపాయాలపై పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోగా విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొరిమి ఓంకారం, మాజీ మండల పార్టీ అధ్యక్షులు, మాజీ ఎంపీటీసీ పల్లె వెంకన్న,ట్రస్మా జిల్లా అధ్యక్షులు కోడి శ్రీనివాసులు, మాజీ ఎంపీటీసీ గంట సత్యం, మాజీ సర్పంచ్ కోడి గిరిబాబు, దశరథ,కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.