calender_icon.png 12 August, 2025 | 3:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గద్వాల జిల్లాలో మెగా ఆయిల్‌పామ్ నాట్లు

11-08-2025 11:27:07 PM

గద్వాల (విజయక్రాంతి): గద్వాల మండలం జిల్లేడబండ గ్రామంలో సోమవారం మెగా ఆయిల్‌పామ్ ప్లాంటేషన్ కార్యక్రమం జరిగింది. రైతు దీన్నే ప్రభాకర్ రావుకు చెందిన 13 ఎకరాల పొలంలో ఆయిల్‌పామ్ మొక్కలను జిల్లా ఉద్యానాధికారి ఎం.ఏ. అక్బర్(District Horticulture Officer M.A. Akbar) నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అత్యల్ప దిగుబడితో అధిక లాభాలు అందించే పంటల్లో ఆయిల్‌పామ్ ముందుంటుందని, ప్రభుత్వ ప్రోత్సాహకర పథకాలతో రైతులకు ఇది ఎంతో మేలు చేస్తుందని చెప్పారు. అంతేకాకుండా, ఆయిల్‌పామ్ తోటల్లో అంతర్‌పంటలు వేసుకోవడానికి అవకాశం ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో గద్వాల డివిజన్ ఉద్యానాధికారి రాజశేఖర్, ఆయిల్‌పామ్ జిల్లా ఇన్‌చార్జి శివనాగి రెడ్డి, గద్వాల మండల ఆయిల్‌పామ్ క్షేత్రసాయి అధికారి శశిధర్ గౌడ్, గ్రామ రైతులు పాల్గొన్నారు.