11-08-2025 11:30:37 PM
గుంట శ్రీశైలం..
బెల్లంపల్లి (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండలం అవడం గ్రామంలో తల్లి అక్రమసంబంధం మరో వ్యక్తితో కొనసాగిస్తుంది అనే నెపంతో మానసిక వేదనకు గురై పురుగుల మందు తాగి దుర్కి అనిల్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అనిల్ ఆత్మహత్యతో కోపోద్రికులైన అతని కుటుంబ సభ్యులు మరణానికి కారణమైన వ్యక్తి ఇంటి ముందు శవాన్ని ఉంచి ఇంటిపై దాడి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని దాడికి పాల్పడిన పలువురుపై కేసు నమోదు చేశారు.
ఈ క్రమంలో దాడికి సంబంధంలేని సుమారు 27 మందిపై అక్రమ కేసు పెట్టారని ఆరోపిస్తూ బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి(MLA Gaddam Vinod Venkataswamy)ని సోమవారం హైదరాబాదులోని తన కార్యాలయంలో మంచిర్యాల జిల్లా కురుమ సంఘం అధ్యక్షుడు గుంట శ్రీశైలం ఈ సంఘటనపై పలు విషయాలు ఎమ్మెల్యేకు స్వయంగా తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే వినోద్ సానుకూలంగా స్పందిస్తూ అనిల్ కుటుంబాన్ని పరామర్శిస్తానని చెప్పడమే కాకుండా కేసు గురించి పూర్తి వివరాలు తెలుసుకొని కేసులో సంబంధంలేని వ్యక్తుల పేర్లను తొలగించడానికి ప్రయత్నిస్తానని హామీ ఇచ్చినట్లు గుంట శ్రీశైలం తెలిపారు.