calender_icon.png 12 August, 2025 | 2:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి విక్రయదారుల అరెస్ట్

11-08-2025 10:54:05 PM

ఎల్లారెడ్డిపేట సిఐ శ్రీనివాస్ గౌడ్..

ఎల్లారెడ్డిపేట (విజయక్రాంతి): వీర్నపల్లి మండలంలోని రంగంపేట గ్రామ శివారులోని జంపన్న చెరువు సమీపంలో గంజాయి కలిగి వున్న ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నట్లు, వారి వద్ద 50 గ్రాముల గంజాయినీ స్వాదీనం చేసుకున్నట్లు ఎల్లారెడ్డిపేట సిఐ బి.శ్రీనివాస్ గౌడ్(CI Srinivas Goud) తెలిపారు. సిఐ తెలిపిన వివరాల ప్రకారం, సిరికొండ మండలం పందిమడుగు గ్రామానికి చెందిన మలావత్ రామ్ కుమార్, వీర్నపల్లి మండలం సీతారాం నాయక్ తండాకు చెందిన ప్రస్తుత నివాసి రాగుడు గ్రామ సమీపంలోని రంగినేని ట్రస్ట్  బాలాజీ నగర్ కు చెందిన బానోతు అజయ్, వీర్నపల్లి మండలం సీతారాం నాయక్ తండాకు చెందిన  బానోతు అజయ్ కుమార్, అదే తండాకు చెందిన ప్రస్తుత నివాసి అజ్మీరా సాయి విశాల్ ను అరెస్ట్ చేశామని సిఐ తెలిపారు. 

జల్సాలకు అలవాటు పడ్డ ముగ్గురు యువకులు గంజాయి సేవిస్తూ అధిక ఆదాయం కొరకు నిజామా బాద్ పట్టణానికి చెందిన గుర్తు తెలియని వ్యక్తులకు గంజాయి విక్రయించడానికి రంగంపేట జంపన్న చెరువు వద్దకు రాగా పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్ చేయగా కోర్టు నిందితులను జైలుకు పంపించినట్లు సిఐ తెలిపారు. గంజాయి విక్రయంలో చాకచక్యుంగా వ్యవహరించిన వీర్ణపల్లి ఎస్ ఐ వేముల లక్ష్మణ్ ను పోలీస్ సిబ్బందినీ సిఐ అభినందించారు.