calender_icon.png 12 August, 2025 | 3:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీఐ కమిషనర్ల ప్రమాణస్వీకారం

15-05-2025 12:00:00 AM

హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి 

హైదరాబాద్, మే 14 (విజయక్రాం తి): రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్లుగా సీనియర్ జర్నలిస్టులు పీవీ శ్రీనివాస్, బోరెడ్డి అయోధ్యరెడ్డి, న్యాయవాదులు దేశాల భూపాల్, మోహిసినా పర్వీన్ ప్రమాణస్వీకారం చేశారు. వారి తో రాష్ట్ర ప్రధాన సమాచార హక్కు చట్టం కమిషనర్ జీ చంద్రశేఖర్‌రెడ్డి బుధవారం సచివాలయంలో ప్రమాణస్వీకా రం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు హాజరయ్యారు.

ఈ సందర్భంగా నూతనంగా ప్రమాణస్వీకారం చేసిన ఆర్టీఐ కమిషనర్లకు సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. వీరు పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మూడేళ్లపాటు లేదా వయసు 65 ఏళ్లు నిండేవరకు రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్లుగా కొనసాగుతారు. కాగా, ఆర్టీఐ ప్రధాన కమిషనర్‌గా ఐఎఫ్‌ఎస్ అధికారి జీ చంద్రశేఖర్‌రెడ్డి గత శుక్రవారమే బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.