11-08-2025 11:34:46 PM
కొండాపూర్: కొండాపూర్ మండల తహసిల్దార్ కార్యాలయంలో సోమవారం తహసిల్దార్ అశోక్(Tahsildar Ashok) ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజావాణిలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఐదు దరఖాస్తులు స్వీకరించినట్లు తహసిల్దార్ తెలిపారు. ఇప్పటివరకు ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్లు తహసిల్దార్ అశోక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.