ఎక్సైజ్ బదిలీ మినహాయింపుపై తీర్పు వాయిదా

26-04-2024 02:02:34 AM

హైదరాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): ఎన్నికల సమయంలో మూడేళ్ల సర్వీస్ పూర్తయిన సిబ్బం ది, అధికారులను బదిలీ చేయాలన్న నిబంధన నుంచి ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇచ్చారంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో గురువారం వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు పూర్తి కావడంతో తీర్పును వాయిదా వేస్తున్న ట్టు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ అరధే, జస్టిస్ జే అనిల్ కుమార్‌తో కూడిన ధర్మాసనం ప్రకటించింది.

బదిలీలపై ఈసీ ప్రొసీ డింగ్స్ ఇచ్చిందని, ఫిబ్రవరిలో ఎక్సయిజ్ అధికారులకు మినహాయింపు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ సికింద్రాబాద్‌కు చెందిన బీ నాగధర్‌సింగ్ ప్రజాహిత వ్యాజ్యా న్ని దాఖలు చేశారు. ఎన్నికల సమయంలో గతంలో పనిచేస్తున్న అధి కారులను మరో ప్రాంతానికి బదిలీ చేసినప్పటికీ ఎక్సైజ్ సిబ్బందిని మాత్రం బదిలీ చేయలేదని పిటిషనర్ న్యాయవాది వాదించారు. ఎన్ని కల విధుల్లో పాల్గొనని సిబ్బంది, అధికారులను బదిలీ చేయాలని లేదని ఈసీ తరఫు సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ చెప్పారు. వాదనల తర్వాత హైకోర్టు తీర్పును రిజర్వులో పెట్టింది.