05-08-2025 12:11:04 AM
నిజామాబాద్, ఆగస్టు 4 (విజయ క్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో స్థానిక సంస్థలలో పోటీపై సిద్ధమవుతున్న అభ్యర్థులలో రిజర్వేషన్ టెన్షన్ పట్టుకుంది. రాష్ట్రంలో గ్రామపంచాయతీ పాలన ముగిసి ఏడదిన్నరా కావస్తోంది. అలాగే ఎంపీపీ జడ్పీ టీసీల పాలన సైతం ముగిసి సంవత్సరం కావస్తోంది.
పదవి కాలం పూర్తవు తున్న ఆరు నెలల ముందు ఉండే ఎన్నికల తంతు మొదలు కావలసి ఉండగా పదికాలాలు ముసి ఏడాదిన్నర కరుస్తున్నప్పటికి ని ఆరు నెలల్లో ఎలక్షన్లు తిరిగి నిర్వహించాల్సి ఉన్నప్పటికీని వివిధ కారణాల చేత ఎన్నికలు జరగలేదు. ఈనెల చివర్లో ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వనుందని సాంకేతలతో జిల్లాలోని స్థానిక సంస్థలకు పోటీపై ఉత్సాహం చెబుతున్న వారు అప్రమత్తమై ఉన్నారు.
ఏ క్షణమైనా నోటిఫికేషన్ పడితే స్థానికంగా రాజకీయ అనుభవం ఉన్నవారు పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు స్థానిక రిజర్వేషన్లను ఎంత శాతం అమలు చేస్తారు ఏ మండలం లో ఏ గ్రామం ఉన్నది రిజర్వేషన్ రిజర్వేషన్ ఏ వర్గానికి వచ్చింది లేదా జనరల్ అనే మీనమేషాలు లెక్కిస్తున్నారు. స్థానిక సంస్థల రిజర్వేషన్ పై ఇప్పటికే న్యాయపరమైన చిక్కులు కోర్టు సూచనలు వస్తున్న నేపథ్యంలో రిజర్వేషన్ల క్లారిటీ లేక అభ్యర్థులు మరింత కలవరానికి గురవుతున్నారు.
గత పది సంవత్సరాల టిఆర్‌ఎస్ పార్టీ పాలనలో కేసీఆర్ ప్రభుత్వం ఇస్తాను సారంగా ఎన్నికల రిజర్వేషన్లు మార్చడం మండలాలను ఏర్పాటు చేయడం ఏ గ్రామం ఏ మండలంలో ఉందో రెవెన్యూ వారికి కూడా సరిగా తెలియకపోవడం ఆందోళనకరమైన విషయం. 2019లో నిర్వహించాల్సిన సర్పంచ్ ఎన్నికల కోసం 2018లో పంచాయతీరాజ్ చట్టంలో పలు సవరణలు చేసింది పదెండ్లకోసారి చట్టానికి సవరణలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
గతంలో ఉన్న ఓబీసీ రిజర్వేషన్ 34 శాతాన్ని 23% తగ్గించింది దీనిపై పెద్ద ఎత్తున బీసీల నుండి నీరసన్న వ్యక్తం అయింది కాగా ఇప్పుడు 42% తీర్మానం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ఢిల్లీలో 5 6 7 తేదీల్లో ధర్నాకు సిద్ధమవుతోంది. ఈ విషయమై బిసి వర్గాలు సుప్రీంకోర్టు తలుపుతట్టగా రిజర్వేషన్లు మార్చడంపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో తలగ్గిన కేసీఆర్ సర్కార్ స్థానిక ఎన్నికలను కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహిస్తామని తమ అడ్వకేట్ జనరల్ ద్వారా న్యాయస్థానానికి తెలిపింది.
ఇదిలా ఉండగా ఈనెల చివర్లో స్థానిక సంస్థలకు నోటిఫికేషన్ ఇచ్చి వచ్చే నెల రెండో వారంలో ఎన్నికలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది . గత ఏడాదిన్నరగా సర్పంచ్ ఎంపీటీసీ ఎంపీపీ జడ్పిటిసి గా పోటీ చేయాలని భావిస్తున్న ఆశావాహులు తాము పోటీ చేసే గ్రామాలు ఏ పరిధిలో ఉన్నాయి ఏ మండలంలో ఉన్నాయని ఒకవేళ తమ అనుకూల ఓటర్లు ఉన్న స్థానం భద్రంగా ఉంటే ఆ స్థానం రిజర్వేషన్ లో ఏ వర్గానికి వస్తుందోనన్న భయాందోళన ఆశవాలను వెంటాడుతున్నాయి.
గత ఎన్నికల్లో కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చింది అలాగే ఈ రిజర్వేషన్లు ఇష్యూ కోర్టులో ఉంది ఈ క్రమంలో ప్రభుత్వం మాత్రం రాబోయే నెలలో లోకల్ బాడీ ఎన్నికలు తప్పకుండా జరిపిస్తుందని నాయకులు హామీ ఇచ్చారు. స్థానిక ఎన్నికల లో పూర్తిగా బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని కోర్టు నిర్ణయం కొరకు వేయుచున్న నేపథ్యంలో ప్రభుత్వం తరఫున మంత్రులు లీడర్లు రిజర్వేషన్లపై ఏ సభలోను ప్రస్తావించకపోవడం గమనారం.
ఇందుకు కారణం రిజర్వేషన్ల విషయమై రాష్ట్ర మంత్రులు లీడర్లు ఎక్కడ కూడా బయట మాట్లాడకూడదని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పత్వ జారీ చేసినట్టు తెలుస్తోంది. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవల ఒక సభలో కీలక వ్యాఖ్యలు చేశారు స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలననే గట్టి సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఉందని తెలిపారు. ఇందుకుగాను రాష్ట్రవ్యాప్తంగా కులగలనా చట్టం చేసి గవర్నర్ ఆమోదానికి పంపామని ఆ వెనువెంటనే కేంద్రానికి పంపామని ఆయన తెలిపారు.
ఈ కారణం చేత గ్రామపంచాయతీ ఎలక్షన్లు ఆలస్యం అవుతున్నట్టు ఆయన స్పష్టం చేశారు. గత పది ఏళ్ల పాలనలో అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్ పార్టీ తరఫున స్థానిక లీడర్లు ఎన్నికల్లో గెలిచి సర్పంచులు ఎంపీటీసీ ఎంపీపీ జడ్పిటిసి పదవుల్లో కొనసాగారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో పాటు జనహిత ప్రజా యాత్ర నిర్వహించి జోడు నినాదంతో ముందుకు సాగుతున్న కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయిలో కమిటీలను మరింత బలోపేతం చేసిందని చెప్పవచ్చు.
ఎందుకు కారణం ప్రతి గ్రామాల నుండి క్యాడర్ కు సంబంధించిన పూర్తి వివరాలు స్థానిక ఎమ్మెల్యేల వద్ద జిల్లా పార్టీ కార్యాలయంలో నమోదు చేయబడి ఉన్నాయి. ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే అధికారం లో ఉన్న పార్టీకే ఎక్కువగా గెలుపు అవకాశాలు ఉంటాయనేది నానుడి అదేవిధంగా లోకల్ లీడర్ల చూపు అధికార పార్టీ టికెట్లపై ఉండడంతో ఆశావాహుల లిస్టు రోజురోజుకు పెరుగుతోంది. సర్పంచ్ ఎంపీటీసీ ఎంపీపీ జడ్పిటిసి పోటీలలో ఉండాలని భావిస్తున్న నేతలు తమ పరిధిలో గల ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.