05-08-2025 12:10:31 AM
ఎస్పీ నరసింహ
సూర్యాపేట, ఆగస్టు 4 (విజయక్రాంతి) : పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందని జిల్లా ఎస్పీ కే నరసింహ అన్నారు. జిల్లాలోని ఆత్మకూర్ (ఎస్) మండలం గట్టికల్లు గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళ రెండు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా ఆమె భర్త రాములు 15 రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించారు. అయితే వారి ఇద్దరు పిల్లలు మాత్రమే ఉంటుండగా సోమవారం పిల్లల గృహాన్ని సందర్శించి పోలీసు ప్రజా భరోసా కార్యక్రమంలో బాగంగా పిల్లలకు నిత్యావసరాలు, పాఠ్య పుస్తకాలు, నగదు ఆర్థిక సహాయం అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల బారినపడి పిల్లలను, కుటుంబాలను ఒంటరి వాళ్ళను చేయొద్దు అని కోరారు. ప్రయాణ సమయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. పిల్లల పరిస్థితి గమనించి స్నేహపూర్వక పోలీసు, పోలీసు ప్రజా భరోసా ద్వారా పోలీసు శాఖ తరపున సహకారం అందించాలని గ్రామానికి వచ్చామన్నారు. పిల్లలను చేరదీసి వారి పోషణ, అలపాలన చూస్తున్న అదే గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ రాచకొండ రమేష్, హేమలత దంపతులను ప్రత్యేకంగా అభిందంచి కృతజ్ఞతలు తెలిపినారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్, ఆత్మకూరు ఎస్త్స్ర శ్రీకాంత్, జిల్లా పోలీసు వెలిఫర్ ఆర్‌ఎస్‌ఐ లు సాయిరాం, సురేష్, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.