calender_icon.png 11 August, 2025 | 2:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

6 వరుసలుగా విస్తరించండి

06-08-2025 12:56:12 AM

  1. విశాలంగా హైదరాబాద్-విజయవాడ హైవేను నిర్మించాలి
  2. ఎలివేటెడ్ కారిడార్‌గా హైదరాబాద్--శ్రీశైలం హైవే
  3. ఆర్‌ఆర్‌ఆర్ పనులను వెంటనే చేపట్టాలి
  4. కేంద్రమంత్రి గడ్కరీకి మంత్రి కోమటిరెడ్డి విజ్ఞప్తి
  5. అలైన్‌మెంట్ ప్రపోజల్స్ పంపితే పనులు ప్రారంభిస్తాం..
  6. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ

హైదరాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి): నిత్యం ప్రమాదాలు జరగుతున్న హైదరాబా ద్- విజయవాడ హైవేను 6 లేన్లుగా విస్తరించేందుకు సహకరించాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ఆర్‌అండ్‌బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి  కోరా రు. మంగళవారం ఢిల్లీలో గడ్కరీతో మంత్రి కోమటిరెడ్డి సమావేశమయ్యారు. రాష్ర్టంలో పెండింగ్‌లో ఉన్న జాతీయ రహదారుల మంజూరీపై సుదీర్ఘంగా చర్చించారు.

మంత్రితోపాటు కాం గ్రెస్ ఎంపీలు సురేశ్ షెట్కార్, వంశీకృష్ణ, చామల, రఘురామిరెడ్డి, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి హాజరయ్యారు. హైదరాబా ద్-- విజయవాడ జాతీయ రహదారిని 6 వరుసలుగా విస్తరించడంతో పాటు సర్వీస్ రోడ్లను నిర్మించాలని కోరారు. ఈ హైవేపై గత నెల 27న జరిగిన ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు డీఎస్పీలు మృతి చెందిన విషయాన్ని గడ్కరీ దృష్టికి తీసుకుపోయారు.

ఈ ఘటనపై గడ్కరీ చలించిపోయారు.కోమటిరెడ్డి విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన గడ్కరీ.. ఆగష్టు 15వ తేదీన నిర్వహించే ఫైనాన్స్ మీటింగ్ లో ఈ హైవే విస్తరణను ఆమోదిస్తామని, త్వరితగతిన అంచనాలు రూపొందించి పంపాలని, వెంటనే టెండర్లు పిలుస్తామని స్పష్టం చేశారు.

ఆర్‌ఆర్‌ఆర్ పనులు త్వరగా చేపట్టండి

హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) పనులను వెంటనే చేపట్టాలని కోమ టిరెడ్డి కోరారు. ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగానికి భూసేకరణ పూ ర్తి చేసిన విషయాన్ని గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు. 4 వరుసలుగా నిర్మించాలనుకున్న ఆర్‌ఆర్‌ఆర్‌ను భవిష్యత్ అవ సరాలను దృష్టిలో పెట్టుకొని 6 వరుసలుగా నిర్మించేందుకు ఎస్టిమేషన్లు మార్పు చేస్తున్నామని, టెండర్లను సైతం అందుకు అను గుణంగా ఫైనలైజ్ చేస్తామని తెలిపారు.

రీవైజ్ ఇష్టిమేషన్‌తో మూడు నెలల్లో ఉత్తరభాగం పనులు మొదలు పెట్టాలని, ఉత్తర భాగంతో పాటే దక్షిణ భాగం కూడా యుద్ధప్రతిపాదికన ప్రారంభించేలా ఆదేశాలు ఇ వ్వాలని కోరారు. ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగం ఇండస్ట్రియల్ కారిడార్‌గా రూపుదిద్దుకోను న్న నేపథ్యంలో వేగంగా పనులు చేపట్టాలని కోరారు. ఆలస్యం జరిగితే భూసేకరణకు ధర లు పెరిగి ప్రాజెక్టుకు ఇబ్బంది కలిగే అవకా శం ఉందని  అలైన్‌మెంట్ ప్ర పోజల్స్ పంపితే అనుకున్నదానికన్న ముందే పనులు ప్రారంభించేలా చర్యలు చేపడతామని గడ్క రీ హామీ ఇచ్చారు.

డబుల్ డెక్కర్ ఫ్లు ఓవర్ నిర్మించాలి

హైదరాబాద్-విజయవాడ మార్గంలో చింతల్‌కుంట చెక్‌పోస్ట్ నుంచి హయత్‌నగ ర్, ఆల్ ఇండియా రేడియో స్టేషన్ వరకు దా దాపు 5 కి.మీ ప్రాంతాన్ని ఎలివేటెడ్ కారిడార్‌గా నిర్మించడంతో పాటు నాగ్‌పూర్‌లో మాదిరిగా డబుల్ డెక్కర్ ఫ్లుఓవర్‌గా నిర్మా ణం చేపట్టాలని కోరారు. ప్రతిపాదనలు పంపిస్తే వెంటనే మంజూరు చేస్తామని గ డ్కరీ హామీ ఇచ్చారు.

హైదరాబాద్-శ్రీశైలం హైవేలో టైగర్ రిజర్వ్ నుంచి వెళ్తున్న ప్రాం తాన్ని ఎలివేటెడ్ కారిడార్‌గా గుర్తించాలన్న కోమటిరెడ్డి విజ్ఞాపనకు.. అలైన్‌మెంట్ అ ప్రూవల్ ఇస్తూ మంజూరు చేస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. ప్రస్తు తం 62 కి.మీ ఉన్న హైవేను ఎలివేటెడ్ కారిడార్‌గా మార్చితే 58 కి.మీ అవుతుంతన్నారు. ఎలివేటెడ్ కారిడార్ కావడం వల్ల వన్యప్రాణులకు ఎలాంటి ఇబ్బందులుండవని తెలిపారు.